Homeఆంధ్రప్రదేశ్‌Vallabhaneni Vamsi: గన్నవరంలో ‘మట్టి’ మంటలు.. వంశీకి చుక్కలు చూపిస్తున్న ప్రత్యర్థులు

Vallabhaneni Vamsi: గన్నవరంలో ‘మట్టి’ మంటలు.. వంశీకి చుక్కలు చూపిస్తున్న ప్రత్యర్థులు

Vallabhaneni Vamsi: గన్నవరం వైసీపీలో మంట వేసి అధిష్టానం చలి కాగుతుందా? నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలకు అగ్ర నేతలే ఆజ్యం పోస్తున్నారా? వల్లభనేని వంశీకి పొమ్మన లేక పొగ పెడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో నేతల వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు ఇప్పటివి కావు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాకతో ప్రారంభమయ్యాయి. ఇటీవల మరింతగా ముదిరాయి. వంశీని టార్గెట్ చేస్తూ ప్రత్యర్ధినేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఇప్పటికే వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో హోరాహోరీ తలపడుతున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు ఎన్నికలకు ముందు వంశీకి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న మట్టి తవ్వకాల ఆరోపణలు వంశీకి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో వంశీ యథేచ్చగా మట్టితవ్వకాలు చేస్తూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న ఆరోపణలు వంశీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతటి వారు ఆగకుండా అక్రమ పర్వాన్ని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో అధికారుడు మట్టి తవ్వకాలపై దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై వంశీ ఆగ్రహంగా ఉన్నారు. ప్రత్యర్ధుల ఆరోపణలతో గన్నవరంలో మట్టి తవ్వకాల వ్యవహారం అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అధిష్టాన పెద్దలు వంశీకి భరోసా ఇవ్వలేదు. దీంతో వంశీ నొచ్చకుంటున్నారు.

Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi

గత ఎన్నికల్లో విలన్ పై పోటీ…

ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు, వైసీపీ డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి కొంతకాలంగా విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం విదితమే. తాజాగా వారికి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు తోడయ్యారు. ఆయన శుక్రవారం నియోజకవర్గానికి వచ్చారు. వంశీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒక విలన్‌పై పోటీ చేశానన్నారు. అతడిని పార్టీలోకి తీసుకునే సమయంలో వ్యతిరేకించానని చెప్పారు. ప్రతిసారీ తాను అధిష్ఠానంతో పోరాటం చేయలేనని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నత కాలం గన్నవరం రాజకీయాల్లో తాను ఉంటానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయని విలేకరులు ప్రశ్నించగా.. ఈ రోజు వరకు తాను టీడీపీ నాయకులతో మంతనాలు జరపలేదన్నారు. వైసీపీ అధిష్ఠానం గన్నవరం సీటు ఎవరికి ఇస్తే వారు పోటీ చేస్తారని.. అద్దెకొచ్చిన వారికి ఇస్తుందా లేక సొంత పార్టీలో ఉన్నవారికి ఇస్తుందా అనేది దాని ఇష్టమని చెప్పారు. తనకిస్తే పోటీచేస్తానన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు మట్టి అక్రమాలపై తాను పోరాటం చేశానన్నారు.

Vallabhaneni Vamsi
Vamsi, Dutta Rama Chandarao

Also Read: Actor Naresh Ready For Third Marriage: 62 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన నరేష్!.. అమ్మాయి ఆ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్

స్ట్రాంగ్ కౌంటర్..

మట్టి మాఫియా ఆరోపణలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి ఎవడికైనా మట్టి ఎంటో, మట్టి కున్న ప్రాధాన్యత ఎంటో అర్ధం అవుతుందన్నారు. ఇదేదో గ్రానైట్ ,బాక్సైట్ , బొగ్గు , వెండి , బంగారం కాదన్నారు. కృష్ణపట్నం పోర్టు ,చెన్నై పోర్టు ఇతర దేశాల నుంచి మట్టిని తీసుకురావటం లేదు కదా అన్నారు. ఇక్కడ మట్టి తవ్వి కుప్పం తరలిస్తున్నారా అని ప్రశ్నించారు. మాంసం కన్నా మసాలా ఖర్చు ఎక్కువ అన్నట్లు మాదిరిగా మట్టి ఖర్చు కన్నా డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు. మట్టి డోల్ మైట్ , బాక్సైట్ , గ్రానైట్ లా మట్టి ఖరీదైన వస్తువు కాదన్నారు. బరువు ఎక్కువ ఖర్చు తక్కువ అన్నారు. ఇంగిత జ్ఞానం లేనివారు రాజకీయం వస్తే కటిక పేదవాళ్లు ఇబ్బందులు పడుతారని చెప్పారు. కటిక.పేదవాడైనా,కుబేరుడైనా తమ ఇళ్లు నిర్మాణం కోసం, రైతులు తమ పొలాలు మెరక తొలుకోవటానికి మట్టి ఎంతో అవసరం ఉంటుంది. వీరికి మట్టి ఎక్కడ నుంచి వస్తోంది గ్రామాల్లో చెరువుల నుంచి కాదా లేదంటే పై నుంచి బాబాలు దగ్గర నుంచి మట్టి వస్తోందా అన్నారు. ట్రాక్టర్లు, ప్రొక్లైయిన్ డీజిల్ కే ఖర్చు అవుతోందని డబ్బులు ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. వీళ్లంతా చంద్రబాబు స్కూల్ చెందిన వాళ్లు.. నీ మీదా బురద జల్లుతాం… తారు వేస్తాం మీరే ఉత్కోవాలి బాధ్యత మీదే అన్నట్లుగా ఇలాంటి విమర్శలు ఉంటాయిన్నారు

Also Read: Shortage Of Petrol In AP: ఏపీలో పెట్రోల్ కు కటకట..బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper