Vallabhaneni Vamsi: గన్నవరం వైసీపీలో మంట వేసి అధిష్టానం చలి కాగుతుందా? నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలకు అగ్ర నేతలే ఆజ్యం పోస్తున్నారా? వల్లభనేని వంశీకి పొమ్మన లేక పొగ పెడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో నేతల వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు ఇప్పటివి కావు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాకతో ప్రారంభమయ్యాయి. ఇటీవల మరింతగా ముదిరాయి. వంశీని టార్గెట్ చేస్తూ ప్రత్యర్ధినేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఇప్పటికే వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో హోరాహోరీ తలపడుతున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు ఎన్నికలకు ముందు వంశీకి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న మట్టి తవ్వకాల ఆరోపణలు వంశీకి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో వంశీ యథేచ్చగా మట్టితవ్వకాలు చేస్తూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న ఆరోపణలు వంశీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతటి వారు ఆగకుండా అక్రమ పర్వాన్ని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో అధికారుడు మట్టి తవ్వకాలపై దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై వంశీ ఆగ్రహంగా ఉన్నారు. ప్రత్యర్ధుల ఆరోపణలతో గన్నవరంలో మట్టి తవ్వకాల వ్యవహారం అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అధిష్టాన పెద్దలు వంశీకి భరోసా ఇవ్వలేదు. దీంతో వంశీ నొచ్చకుంటున్నారు.
గత ఎన్నికల్లో విలన్ పై పోటీ…
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు, వైసీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి కొంతకాలంగా విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం విదితమే. తాజాగా వారికి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు తోడయ్యారు. ఆయన శుక్రవారం నియోజకవర్గానికి వచ్చారు. వంశీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒక విలన్‌పై పోటీ చేశానన్నారు. అతడిని పార్టీలోకి తీసుకునే సమయంలో వ్యతిరేకించానని చెప్పారు. ప్రతిసారీ తాను అధిష్ఠానంతో పోరాటం చేయలేనని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నత కాలం గన్నవరం రాజకీయాల్లో తాను ఉంటానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయని విలేకరులు ప్రశ్నించగా.. ఈ రోజు వరకు తాను టీడీపీ నాయకులతో మంతనాలు జరపలేదన్నారు. వైసీపీ అధిష్ఠానం గన్నవరం సీటు ఎవరికి ఇస్తే వారు పోటీ చేస్తారని.. అద్దెకొచ్చిన వారికి ఇస్తుందా లేక సొంత పార్టీలో ఉన్నవారికి ఇస్తుందా అనేది దాని ఇష్టమని చెప్పారు. తనకిస్తే పోటీచేస్తానన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు మట్టి అక్రమాలపై తాను పోరాటం చేశానన్నారు.
స్ట్రాంగ్ కౌంటర్..
మట్టి మాఫియా ఆరోపణలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి ఎవడికైనా మట్టి ఎంటో, మట్టి కున్న ప్రాధాన్యత ఎంటో అర్ధం అవుతుందన్నారు. ఇదేదో గ్రానైట్ ,బాక్సైట్ , బొగ్గు , వెండి , బంగారం కాదన్నారు. కృష్ణపట్నం పోర్టు ,చెన్నై పోర్టు ఇతర దేశాల నుంచి మట్టిని తీసుకురావటం లేదు కదా అన్నారు. ఇక్కడ మట్టి తవ్వి కుప్పం తరలిస్తున్నారా అని ప్రశ్నించారు. మాంసం కన్నా మసాలా ఖర్చు ఎక్కువ అన్నట్లు మాదిరిగా మట్టి ఖర్చు కన్నా డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు. మట్టి డోల్ మైట్ , బాక్సైట్ , గ్రానైట్ లా మట్టి ఖరీదైన వస్తువు కాదన్నారు. బరువు ఎక్కువ ఖర్చు తక్కువ అన్నారు. ఇంగిత జ్ఞానం లేనివారు రాజకీయం వస్తే కటిక పేదవాళ్లు ఇబ్బందులు పడుతారని చెప్పారు. కటిక.పేదవాడైనా,కుబేరుడైనా తమ ఇళ్లు నిర్మాణం కోసం, రైతులు తమ పొలాలు మెరక తొలుకోవటానికి మట్టి ఎంతో అవసరం ఉంటుంది. వీరికి మట్టి ఎక్కడ నుంచి వస్తోంది గ్రామాల్లో చెరువుల నుంచి కాదా లేదంటే పై నుంచి బాబాలు దగ్గర నుంచి మట్టి వస్తోందా అన్నారు. ట్రాక్టర్లు, ప్రొక్లైయిన్ డీజిల్ కే ఖర్చు అవుతోందని డబ్బులు ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. వీళ్లంతా చంద్రబాబు స్కూల్ చెందిన వాళ్లు.. నీ మీదా బురద జల్లుతాం… తారు వేస్తాం మీరే ఉత్కోవాలి బాధ్యత మీదే అన్నట్లుగా ఇలాంటి విమర్శలు ఉంటాయిన్నారు
Also Read: Shortage Of Petrol In AP: ఏపీలో పెట్రోల్ కు కటకట..బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు