Snakes: తెలుగు రాష్ట్రాలపై పాముల పగ.. కుప్పలుగా వచ్చేశాయి

Snakes:  అసలే వర్షకాలం.. ఆపై ఈసారి కాలం బాగా అయ్యింది. వర్షాలు జోరుపడుతున్నాయి. వరద పోటెత్తుతోంది. అందుకే పొలాలు, గట్లు, గుట్టల్లో, అడవుల్లో ఉన్న పాములన్నీ కూడా వరదలతో ఊళ్లోకి వచ్చేస్తున్నాయి. లంకలు.. తీర ప్రాంతాలపై పడిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలంలో పాముల సంచారం అధికమైంది. అందరికంటే కూడా కోనసీమలో.. నదీ పరివాహక ప్రాంతంలో పాముల బెడద తీవ్రమైంది. లంక గ్రామాలు.. పరివాహకంలో పాములు కుప్పలుగా కనిపిస్తున్నాయి. పలువురు పాముకాటుకు బలైపోతున్నారు. ఇటీవల ఏపీలో […]

Written By: NARESH, Updated On : June 19, 2023 3:40 pm
Follow us on

Snakes:  అసలే వర్షకాలం.. ఆపై ఈసారి కాలం బాగా అయ్యింది. వర్షాలు జోరుపడుతున్నాయి. వరద పోటెత్తుతోంది. అందుకే పొలాలు, గట్లు, గుట్టల్లో, అడవుల్లో ఉన్న పాములన్నీ కూడా వరదలతో ఊళ్లోకి వచ్చేస్తున్నాయి. లంకలు.. తీర ప్రాంతాలపై పడిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలంలో పాముల సంచారం అధికమైంది. అందరికంటే కూడా కోనసీమలో.. నదీ పరివాహక ప్రాంతంలో పాముల బెడద తీవ్రమైంది. లంక గ్రామాలు.. పరివాహకంలో పాములు కుప్పలుగా కనిపిస్తున్నాయి. పలువురు పాముకాటుకు బలైపోతున్నారు.

ఇటీవల ఏపీలో వరుసగా భారీ విష సర్పాలు పట్టుకోవడం కలకలం రేపింది. ఇళ్లు, బడులు, గుడులు, ఆస్పత్రుల్లోకి వచ్చేస్తున్నాయి. జనాలు పరుగులు తీస్తున్న పరిస్థితి నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో 5 అత్యంత విష సర్పాలు ఉన్నాయని.. అవి కాటు వేస్తే కేవలం 3 గంటల్లో చనిపోతారని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాము కాటు వేయగానే గుండెకు వెళ్లే మార్గాన్ని గట్టిగా తాడు, బట్టతో కట్టేసి కాటు వేసిన ప్రాంతంలో విషాన్ని సూదితో తీసివేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మూడు గంటల్లో చికిత్స అందించకపోతే ప్రాణాలు పోతాయంటున్నారు. పాము కరిస్తే ఏం కాదని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 3 గంటల్లో చికిత్స అందించకపోతే మనిషి బతికే అవకాశాలు లేవంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో దడ పుట్టిస్తున్న పాములు. వరదల ప్రభావంతో కోనసీమలో పెరిగిపోయిన పాముల సంచారం. ఇళ్ళు ,బడులు, గుడులు, హాస్పిటల్స్ లలోకి చేరి జనాలను పరుగులు పెట్టిస్తున్న పాములు.. పి.గన్నవరం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారీ నల్ల తాచుపాము దూరి హాల్చల్ .. పరుగులు తీసిన హాస్పిటల్ సిబ్బంది.. కోనసీమలో వరదలు రావడంతో లంకల్లో, పొలాల్లో ఉండే పాములు ఇళ్లలోకి చేరి జనాలు భయపడిపోతున్నారు. ముమ్మిడివరం మహిపాల చెరువు వద్ద ఒకరి ఇంట్లోని వాషింగ్ మిషన్లో పాము హల్ చల్ చేసింది. భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మని పిలవగా అతడు పాముని బంధించాడు.

ఆసుపత్రి సిబ్బంది స్నాక్ కేచర్ దుర్గారావు కు సమాచారం ఇవ్వడంతో వచ్చి పామును బందించడంతో ఊపిరి పీల్చుకున్న ఆసుపత్రి సిబ్బంది. ఇటీవల చిత్తూరు జిల్లాలో, కోనసీమలోని పి.గన్నవరం పీహెచ్సీలో భారీ నాగుపాములు ప్రజలను భయభంత్రులకు గురిచేశాయి. ఒక్కోటి 9 అడుగుల వరకు పొడవు ఉండి భయపెట్టాయి. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.