
కరోనా వైరస్ ని గుర్తించటంలో ఇటలీ దేశం ఆలస్యం చేసింది. దింతో ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోంది. రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరిగి అనేక నూతన కరోనా పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. ఆ దేశాన్ని ఈ వైరస్ అతలాకుతలం చేస్తోంది. కరోనా వలన ఇప్పటి వరకు 1300 మందికి పైగా మరణించగా, అనేక వేలమంది ఆసుపత్రి పాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. జనవరి 29 వ తేదీన ఇటలీలో రెండు కరోనా కేసులను గుర్తించారు. వైరస్ ను గుర్తించిన వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. వెంటనే ఆరు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ రెండు కేసులను పరిగణలోకి తీసుకొని చైనా నుంచి వచ్చే విమానాల రాకపోకలను నిషేదించారు. కానీ, 20 రోజుల్లో పరిస్థితి మొత్తం తలక్రిందులైంది.
జనవరి 29వ తేదీన రెండు కేసులు నమోదుకాగా, మూడో కేసు ఫిబ్రవరి 18వ తేదీన కోడోగ్నో పట్టణంలో కనుగొన్నారు. అయితే, ఈ మూడో కేసు విషయంలో డాక్టర్లు పొరపడ్డారు. ఇది సాధారణ ఫ్లూ అని అనుకోని పెద్దగా పట్టించుకోలేదు. ఫ్లూ కి ఇచ్చే ట్రీట్మెంట్ నే కరోనా వచ్చిన వ్యక్తికి ఇచ్చారు. ఆయన ఇంటికి వెళ్లడం, సాధారణ రోగిలాగా భావించి ఆయనకు చికిత్స చేయడంతో కరోనా ఒక్కసారిగా విజృభించింది. అతి తక్కువ సమయంలోనే అనేక వేల మందికి పాకింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఆ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. కోడోగ్నో పట్టణంలో ఫ్లూతో వచ్చిన వ్యక్తికి సరిగ్గా ట్రీట్మెంట్ చేసి ఉంటె ఈరోజున ఇటలీ ఈ స్థాయిలో ఇబ్బందులు పడేది కాదని చెప్పొచ్చు.