Skype : ఇప్పుడు వీడియో కాల్ అంటే అందరూ వాట్సాప్ మీద ఆధారపడుతున్నారు. కానీ ఒకప్పుడు వీడియో కాల్ చేయాలంటే స్కైప్ మాత్రమే ఆధారం. వీడియో కాల్ విషయంలో స్కైప్ సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడు అది మూసివేత దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. పోటీ ప్రపంచంలో స్కైప్ నిలవ లేకపోవడంతో దాని నిర్వాహకులు మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఎన్నోసార్లు స్కైప్ కు కొత్త హంగులు అద్దడానికి ప్రయత్నించింది. అయితే అందులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో చేతులెత్తేసింది. ఇక మే నెల నుంచి స్కైప్ పూర్తిగా అంతర్ధానం కానునట్టు తెలుస్తోంది. అయితే దీని స్థానంలో టీమ్స్ ను మైక్రోసాఫ్ట్ బలంగా ప్రచారం చేస్తున్నది. స్కైప్ 2003లో అందుబాటులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ దానిని 2011లో కొన్నది. అనేక మార్పులు చేసి లైవ్ మెసెంజర్ ను నిలిపివేసిన మైక్రోసాఫ్ట్.. స్కైప్ ను మెయిన్ కమ్యూనికేషన్ టూల్ గా మార్చడానికి యత్నించింది. అయితే విండోస్ 10 లో స్కైప్ ను ఇన్ బిల్ట్ చేసినప్పటికీ యూజర్ల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో 9 నెలల్లోనే ఆ ప్రయోగం నిలుపుదలకు కారణమైంది.
Also Read : వాట్సప్ కు మనం అలవాటు పడిపోయాం గాని.. అంతకంటే గొప్ప యాప్స్ చాలా ఉన్నాయి.. ఇంతకీ అవి ఏంటంటే..
మైక్రోసాఫ్ట్ విన్ 32 ను విడిచిపెట్టి యూనివర్సల్ విండోస్ ఫ్లాట్ ఫామ్ కు మారినప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత విన్ 32 నే మైక్రోసాఫ్ట్ కు దిక్కు అయింది. ఇక 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ ను వెలుగులోకి తెచ్చింది. ఇక అప్పటినుంచి స్కైప్ భవితవ్యం ప్రమాదంలో పడింది. యూజర్లు, సంస్థలు టీమ్స్ వైపు ఆసక్తి చూపించాయి. ఫలితంగా స్కైప్ కు ప్రయారిటీ తగ్గింది. ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ దీన్ని సరికొత్తగా మార్చుతుందని అందరూ అనుకున్నారు. కొన్ని సందర్భాల్లో అప్డేట్లు చేసి కొనసాగించింది.. విండోస్ 11 అందుబాటులోకి వచ్చినప్పుడు స్కైప్ ను తొలగించిన మైక్రోసాఫ్ట్.. టీమ్స్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. దీంతో స్కైప్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని టెక్ నిపుణులు అంచనా వేశారు.. మరోవైపు యాపిల్ ఫేస్ టైం, google హ్యాంగ్ అవుట్, డ్యూయో వంటి వాటినుంచి స్కైప్ కు గట్టిగానే పోటీ చేయలేదు. ఇక ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ విఫలం కావడంతో స్కైప్ ఎదుగుదల ఆగిపోయింది. దీంతో మైక్రోసాఫ్ట్ పూర్తిగా టీమ్స్ అభివృద్ధి పైనే దృష్టి సారించింది. దీంతో స్కైప్ అనేది కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అయింది. మరోవైపు వీడియో కాల్స్, మెసేజింగ్ కోసం పూర్తిగా టీమ్స్ వైపు మారిపోవాలని మైక్రోసాఫ్ట్ తన యూజర్లకు సూచిస్తుంది. టీమ్స్ వైపు మారిపోవాలని సూచనలు చేస్తోంది.
Also Read : వాట్సప్ కు మనం అలవాటు పడిపోయాం గాని.. అంతకంటే గొప్ప యాప్స్ చాలా ఉన్నాయి.. ఇంతకీ అవి ఏంటంటే..