
Sisodia Arrest- KCR: ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు ప్రదర్శిస్తున్న సీబీఐ, ఈడీ అరెస్టులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే మద్యం వ్యాపారులను అరెస్టు చేశారు. వారికి సహకరించిన వారినీ అరెస్టు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ స్కాంకు సంబంధించి చార్జిషీట్లలో ఇప్పటి వరకూ 15 మంది పేర్లు పేర్కొనగా, వారిలో మెజారిటీ నిందితులు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. తాజాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాజకీయ నాయకుడిని.. అది కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. విచిత్రం ఏమిటంటే.. ఆయన పేరు చార్జిషీట్లలో ఎక్కడా లేదు. అయినా.. విచారణ పేరిట పిలిచిన సీబీఐ.. తమకు సహకరించడం లేదంటూ అరెస్టు చేసింది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల నెక్ట్స్ టార్గెట్ ఎవరు అపకపది ఆసక్తి రేకెత్తిస్తున్న మిలియ¯Œ డాలర్ల ప్రశ్న. దర్యాప్తు సంస్థలు ఎవరిపై చార్జిషీటు దాఖలు చేసినా అందులో తప్పనిసరిగా సౌత్ గ్రూప్ తరఫున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును కచ్చితంగా ప్రస్తాతవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి తదుపరి టార్గెట్ కవితే అని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే కవిత సన్నిహితుల అరెస్ట్..
మద్యం కుంభకోణంలో ఇప్పటికే కవిత బంధువు రాబి¯Œ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయి¯Œ పల్లిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌కే చెందిన, రాబి¯Œ డిస్టిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్లెని అరెస్టు చేశారు. సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆయన ద్వారానే కవిత పెట్టుబడులు పెట్టారంటూ చార్జిషీట్‌లోనూ పేర్కొన్నారు. కవిత వద్ద గతంలో ఆడిటర్‌గా పని చేసిన బుచ్చిబాబును ఇటీవలే అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాలకే చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఎండీ శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్ తదితరులనూ అరెస్టు చేశారు. ఆ సందర్భంగా దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ కవిత పేరును ప్రస్తావించారు. మాగుంట రాఘవరెడ్డితో కలిసి కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి, కవిత, శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆప్ నేతల తరఫున విజయ్‌నాయర్ స్వీకరించారని తెలిపింది. ఈ గ్రూపునకు అభిషేక్ బోయి¯Œ పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లె, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని వివరించింది. రాజకీయ నాయకులు తమ పేర్లను గోప్యంగా ఉంచడానికి బినామీలను ప్రయోగించారని స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ సహా వీరందరినీ ఇప్పటికే సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. తాజాగా చార్జిషీట్లలో ఎక్కడా పేరు లేని సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. వరుస అరెస్టుల నేపథ్యంలో కవిత అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
సాక్షిగా విచారణ చేసిన సీబీఐ..
లిక్క స్కాం కేసులో ఇప్పటికే కవితను సాక్షిగా విచారణ చేసింది. 160 సీఆర్‌పీసీ కింద డిసెంబరులో సీబీఐ అధికారులు నోటీసులిచ్చి.. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే 7 గంటలకుపైగా విచారణ చేశారు. అవసరమైతే మరోసారి విచారణ చేస్తామని అప్పట్లోనే చెప్పారు. కానీ, ఇప్పటి వరకు కవితను మళ్లీ ప్రశ్నించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే పులుపు రావొచ్చని తెలుస్తోంది. ఈసారి ఢిల్లీకే పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో ఆమె ఇచ్చిన సమాచారం, అంతకుముందు, ఆ తర్వాత అరెస్టు చేసిన వారు ఇచ్చిన వివరాలు, దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుల తెలుస్తోంది. విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని దర్యాప్తు సంస్థల నుంచి వస్తున్న సమాచారం.
తాజా పరిణామాలతో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వేగంగా మారుతున్న పరిణామాలు, వరుస అరెస్ట్‌లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులో ఫ్రస్ట్రేషన్ పెంచుతున్నాయి. ఈ స్కాంతో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తుండడంతో తన కూతురు వంతుపై కేసీఆర్‌లో ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసులో సుప్రీం కోర్టులో విచారణ కొలిక్కి రావడం లేదు. సిట్‌పై ఒకవైపు స్టే కొనసాగుతోంది. ఈ కేసు సీబీఐ చేతికి Ðð ళ్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విచారణ సందర్భంగా తెలంగాణ డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు కేసీఆర తీరునే తప్పు పట్టాయి. ఈ అంశాలు కేసీఆర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయాలనుకుంటున్న కేసీఆర్‌కు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు. బీజేపీని దెబ్బకొట్టాలనుకుంటే తానే దెబ్బైపోతానేమో అన్న భయం కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఈ క్రమంలో గతంలో ఈ స్కారంలో ఎవరు అరెస్ట్ అయినా స్పందించని కేసీఆర్ మనీశ్ సిసోడియా అరెస్ట్‌పై రియాక్ట్ అయ్యారు… ఖండించారు. కేంద్రం ఒత్తిడితోనే సీబీఐ అరెస్ట్ చేసిందని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సైతం బీపీ పెంచుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలను వేట కుక్కలతో పోలుస్తున్నారు. అరెస్ట్ అవుతున్నవారంతా అమాయకులు అని క్లీన్‌చిట్ ఇచ్చేస్తున్నారు. అయితే తన సోదరి కవిత లిక్కర్ స్కాంలో ఉన్నట్లు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొన్నా ఆమె గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. కనీసం ఖండించనూ లేదు.
కలలోనూ సంజయ్ నామస్మరేణే!
తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పేరును పదే పదే స్మరిస్తున్నారు. ఆయనను సంజయ్ అంతలా నిద్రపట్టకుండా చేస్తున్నాడేమో అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తమకు పోటీ కాంగ్రెస్సే అని పదే పదే చెబుతున్న కేటీఆర్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ పేరు తలుచుకోకుండా ఏ మీటింగ్‌లోనూ మాట్లాడడం లేదు. నిద్రలో కూడా కేటీఆర్ సంజయ్ పేరే స్మరిస్తున్నాడేమో అని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

వరంగల్ సభలో ఘాటు వ్యాఖ్యలు..
కేటీఆర్ సోమవారం వరగంల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఘాటుగా స్పందించారు. పీజీ వైద్య విద్యార్థి ప్రీతి మరణాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, తమకు రాజకీయం చేయాలిసన పని లేదని అంటూనే దోషులను శిక్షిస్తామంటూ అది సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలి పెట్టం అని మరోమారు సంజయ్ నామం స్మరించారు. దీంతో సభకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలే కేటీఆర్‌ను సంజయ్ అంతలా భయపెడుతున్నారా అని గుసగుసలాడుకున్నారు.
మొత్తంగా కవిత అరెస్ట్‌పై తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌లో ఆందోళన కనిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల తరుపరి టార్గట్ కవితే అని వారు ఫిక్స్ అయినట్లు వారి మాటలు, విమర్శలను బట్టే అర్థమవుతోందని బీఆర్‌ఎస్ నాయకులతోపాట, కేసీఆర్, కేటీఆర్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.