
తెలంగాణ సర్కారు చేస్తున్న జల వివాదాలకు ఆంధ్రప్రదేశ్ మౌనం వహిస్తోంది. దీంతో తెలంగాణ నాయకులు రెచ్చిపోయి తమ వైఖరి వెల్లడిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దూషిస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అటు శ్రీశైలంతో సహా సర్వహక్కులు ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసుకుంటున్నా ఏపీ సర్కారు నిశ్శబ్దంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైలెంట్ గా ఉన్నవిషయంలో మంత్రివర్గ సమావేశంలో జగన్ వివరణ ఇచ్చారు.
తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల శ్రేయస్సు కోసమే తాము మౌనంగా ఉన్నామని చెప్పారు. కానీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని ప్రశ్నించారు. నీటి విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలో మంత్రులు నిర్ణయించాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో కృష్ణాబోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించారు. జల వివాదాన్ని ప్రధాని మోడీకి ఫిర్యాదు చేయాలని భావించారు.
రాష్ర్ట ప్రయోజనాల కోసమే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. విమర్శలకు కౌంటర్ గా ప్రజలనే చూపించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని నేతలే చెబుతున్నారు. అన్నిటిని భరిస్తూ తెలంగాణలోని ఏపీ ప్రజల ఇబ్బందులు పడకుండా చూస్తున్నామని గమనార్హం. రాజకీయ ప్రయోజనాలకు భంగం కలుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రజలే కారణంగా చూపుతూ తప్పుకోవాలని చూస్తున్నట్లుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో సెటిలైన వారిని తెలంగాణ సర్కారు ఎప్పుడు రాజకీయంగా చూడలేదు. వారికి అందరితో పాటు సర్వహక్కులు కల్పించారు. వారు కూడా టీఆర్ఎస్ కు మద్దతు తెలిపిన సంగతి విదితమే. కానీ ఇప్పుడు ఏపీ తెలంగాణలో స్థిరపడిన ప్రజల కోసమేనంటూ వగలు పలుకుతోందని విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఉన్న వారిని ఉద్దేశించి జగన్ చేసిన ప్రకటనపై విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. లేనిపని ప్రేమ ఒలకబోస్తూ రాష్ర్ట ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.