Illegal Affair : తమిళనాడు రాష్ట్రంలో కళ్ళకురుచి జిల్లాలో ఊళుందుర్ పేట సమీపంలో పిల్లూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో రమణి, అశోక్ భార్యాభర్తలు. ఆగస్టు నెల 19న రమణిని ఆమె భర్త అశోక్ హత్య చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తులో భాగంగా అశోక్ ను విచారించారు. ఈ సందర్భంగా అతడు సంచలన విషయాలు వెల్లడించాడు..” నా భార్య రమణికి వివాహేతర సంబంధం ఉంది. తిరునావలూర్ ఎస్ఐ నందగోపాల్ నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంపై నా భార్యను నిలదీశాను. దీంతో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్త పెద్దది కావడంతో ఆమెను హత్య చేశానని” అశోక్ వెల్లడించాడు. అశోక్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఎస్ఐ నందగోపాల్ పై శాఖా పరమైన విచారణ కొనసాగించారు. నందగోపాల్, రమణ కి మధ్య వివాహేతర సంబంధం ఉందని తేలింది. దీంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో నందగోపాల్ ను సస్పెండ్ చేస్తూ విళుపురం రేంజ్ డిఐజి దిశా మిట్టల్ నిర్ణయం తీసుకున్నారు.
కానిస్టేబుల్ కూడా..
నందగోపాల్ మాత్రమే కాదు విళుపురం జిల్లా మరక్కాణం హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కళ్లకురిచి ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు రమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అశోక్ కు తెలియకుండా పలుమార్లు రమణి, ప్రభాకరన్ బయటికి వెళ్లేవారు. సమీపంలో ఉన్న లాడ్జిలలో గడిపి వచ్చేవారు. అయితే ఈ విషయం కూడా అశోక్ కు తెలిసింది. అప్పట్లో రమణిని మందలించాడు. ఆయనప్పటికీ ఆమె తన ప్రవర్తనను మార్చుకోలేదు. చివరికి ఎస్ఐ నందగోపాల్ రమణి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరు ఒకరోజు ఏకాంతంగా ఉండగా అశోక్ చూశాడు. ఆ విషయంపై రమణిని నిలదీశాడు. అయితే ఈ విషయంపై ఆమె దాటవేత ధోరణి ప్రదర్శించింది. ఫలితంగా అశోక్ లో కోపం పెరిగిపోయి రమణిని హత్య చేశాడు.
పోలీస్ శాఖలో సంచలనం
పోలీస్ శాఖలో ఒకే మహిళతో అటు ఎస్సై, ఇటు కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సంచలనంగా మారింది. ఈ విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఎస్ఐ నందగోపాల్, కానిస్టేబుల్ ప్రభాకరన్ పై పోలీస్ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం అశోక్ జైల్లో ఉన్నాడు. అయితే అశోక్ – రమణి దంపతులకు సంతానం ఉందా? లేదా? అనే విషయాలు తెలియ రాలేదు.