మిర్యాలగూడకు చెందిన వ్యాపార వేత్త, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ సంఘటన ఖైరాతాబాద్లోని వాసవీభవన్లో చోటుచేసుకుంది. శనివారం రాత్రి వాసవీక్లబ్ భవన్ మూడో అంతస్థులో మారుతీరావు గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆదివారం ఉదయం మారుతిరావు అపస్మారక స్థితిలో ఉండటాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే మారుతీరావు మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్యా? చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశఆరు.
మారుతిరావు కుమార్తె అమృత ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో సఫారీ ఇచ్చి ఆమె భర్తను దారుణంగా హత్య చేయించాడు. ఈ సంఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో మారుతీరావు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో మారుతిరావుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అయ్యారు. ప్రణయ్ హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చాడు.
తాజాగా హైదరాబాద్ లోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. ఖైరతాబాద్లోని శ్రీ ఆర్యవైశ్య భవన్ లో గదిని అద్దెకు తీసుకున్నాడు. గది లోపల గడియ పెట్టుకొని విగతజీవిగా పడిపోయాడు. మారుతిరావుది ఆత్మహత్యే అయి ఉంటుందని భావిస్తున్నారు. కుమార్తె తనకు దూరంగా ఉంటుందని మారుతీరావు బాధపడుతుండేవాడు. అలాగే తనను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నట్లుగా మారుతిరావు తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా చెబుతారు. ఎవరూ ఊహించనిరీతిలో మారుతీరావు మృతిచెందడం మరోసారి సంచలనం రేపుతోంది.