టీఆర్ఎస్ కు షాక్: బీజేపీలోకి మంత్రి సోదరుడు?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. గులాబీ దళపతి కేసీఆర్ హనీమూన్ ఇక తెలంగాణలో ముగిసినట్టే. ఆయన రాజేయడానికి ఇక తెలంగాణ సెంటిమెంట్ లేదు. అభివృద్ధి కోణమే మిగిలి ఉంది. కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కరొక్కరుగా జారి పోతున్నారు. Also Read: తెలంగాణ వచ్చాకే నిరుద్యోగం పెరిగిందా..! టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు తాజాగా బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి రంగం సిద్ధమైనట్లు రాజకీయవర్గాల్లో చర్చ […]

Written By: NARESH, Updated On : December 15, 2020 4:46 pm
Follow us on

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. గులాబీ దళపతి కేసీఆర్ హనీమూన్ ఇక తెలంగాణలో ముగిసినట్టే. ఆయన రాజేయడానికి ఇక తెలంగాణ సెంటిమెంట్ లేదు. అభివృద్ధి కోణమే మిగిలి ఉంది. కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కరొక్కరుగా జారి పోతున్నారు.

Also Read: తెలంగాణ వచ్చాకే నిరుద్యోగం పెరిగిందా..!

టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు తాజాగా బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి రంగం సిద్ధమైనట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ప్రదీప్ రావు కన్నేసినట్లు తెలిసింది. ప్రదీప్ వెళ్లిపోయినా ప్రభావం ఏమీ ఉండదని.. తన సోదరుడు వెళ్లినంత మాత్రాన టీఆర్ఎస్ కు వచ్చిన ఢోనా ఏమీ లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నట్టు తెలిసింది.

ఇప్పటికే కాంగ్రెస్ లోని మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరగా.. తాజాగా ఏకంగా టీఆర్ఎస్ కేబినెట్ లోని మంత్రి ఎర్రబెల్లి సోదరుడు బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

Also Read:బీజేపీ జోష్.. టీఆర్ఎస్ సైలెన్స్..!

దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాలతో బీజేపీలో ఫుల్ జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు మొదలయ్యాయని సమాచారం. తెలంగాణ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన బీజేపీ వైపు ఇప్పుడు అసంతృప్తుల చూపు పడుతోంది కాంగ్రెస్, టీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలు అంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్