PK Survey Report On Telangana: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు తలనొప్పులు మొదలయ్యాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో పార్టీలో చర్చ మొదలైంది. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల్లో చాలా మంది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేనని తేల్చడంతో గులాబీ పార్టీలో ఆందోళన నెలకొంది. ముచ్చటగా మూడోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్ కు పీకే సర్వే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పీకే సర్వేతో ఎమ్మెల్యేల్లో కూడా టెన్షన్ ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల్లో తమ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. ఇదివరకే గులాబీ బాస్ హెచ్చరికలు జారీ చేసినా నేతల్లో మార్పు మాత్రం రావడం లేదని తెలుస్తోంది.

ఇదివరకే పీకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సర్వే నిర్వహించారు. దీంతో వారి భవిష్యత్ డోలాయమానంలో పడింది. దీనిపై అధినేత కేసీఆర్ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరి దారి వారు చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోతే చేయాల్సిన విధి విధానాలపై ఓ స్పష్టత తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల నేతలతో టచ్ లో ఉంటున్నారు. టికెట్ దక్కకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారిస్తున్నారు.
Also Read: Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికలో బీజేపీ వ్యూహమేంటి?
ఎమ్మెల్యేల్లో దాదాపు ఇరవై మంది భవితవ్యం మారనుంది. వారికి టికెట్లు ఇచ్చే విషయంలో పీకే సర్వేను లెక్కలోకి తీసుకుని ఆచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న్టట్లు తెలుస్తోంది. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒకవేళ పార్టీ కాదంటే తదుపరి వ్యూహంపై ఇప్పుడే చూసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలతో చనువుగా ఉంటూ టికెట్ రాకపోతే అందులో చేరేందుకు కూడా ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా ఎక్కువవుతోంది. దీంతో వారికి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ ఆగరాదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీల్లో చేరి టికెట్ తెచ్చుకుని విజయం సాధించాలని చూస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తరుణంలో రాష్ట్రంలో పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. పీకే సర్వేతో కేసీఆర్ గుబులు చెందుతున్నారు. పీకే సర్వేతో ఎమ్మెల్యేల జాతకాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి రాజకీయం మారుతోంది. కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.
Also Read:Hero Prashanth: హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతినడానికి కారణం తండ్రేనా?
[…] […]
[…] […]