https://oktelugu.com/

జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్: ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు

వైఎస్ జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిషత్ ఎన్నికలను ఆగమాగం ప్రకటించి పాత నామినేషన్లతోనే ముగిద్దామని చూసిన దానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తాజాగా ఏపీ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ తేదికి 4 వారాల […]

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2021 11:39 am
    Follow us on

    వైఎస్ జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిషత్ ఎన్నికలను ఆగమాగం ప్రకటించి పాత నామినేషన్లతోనే ముగిద్దామని చూసిన దానికి హైకోర్టు బ్రేక్ వేసింది.

    తాజాగా ఏపీ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    పోలింగ్ తేదికి 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని పరిషత్ ఎన్నికలపై గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసేలా ఆగమాగం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చి కేవలం వారానికే ఏప్రిల్ 7న పరిషత్ ఎన్నికలు నిర్వహించింది. పోలింగ్ కు 4 వారాల ముందు నోటిపికేషన్ ఇవ్వలేదు.

    దీంతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, జనసేన, బీజేపీ నేతలు కూడా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. దీనిపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ ఎన్నికలు నిర్వహించినా ఓట్ల లెక్కింపు చేయవద్దని గతంలో ఆదేశించింది.

    ఈ క్రమంలోనే తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలనే రద్దు చేస్తూ తీర్పు వెలువరించడం సంచలనమైంది. కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం సంచలనమైంది.