https://oktelugu.com/

కడపలో జగన్‌కు షాక్‌ : టీడీపీ మద్దతుదారుల విజయం

కడప అంటే వైసీపీ.. వైసీపీ అంటే కడప. ఆ పార్టీకి కేరాఫ్‌ ఆ జిల్లా. ఎందుకంటే అది జగన్‌ సొంత జిల్లా కాబట్టి. గ‌త అ సెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక‌.. ప్రతిప‌క్షం టీడీపీ ఆ జిల్లాలో అడ్రస్ కూడా లేకుండా పోయింది. అంతేకాదు.. గత ఎన్నిక‌ల త‌ర్వాత‌ టీడీపీ కీల‌క నేత‌లు గుండుగుత్తుగా పార్టీ మారి.. త‌లో దిక్కుకు పోయారు. దీంతో క‌డ‌ప‌పై చంద్రబాబు.. ఆయ‌న ప‌రివారం అంతా కూడా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2021 / 02:05 PM IST
    Follow us on


    కడప అంటే వైసీపీ.. వైసీపీ అంటే కడప. ఆ పార్టీకి కేరాఫ్‌ ఆ జిల్లా. ఎందుకంటే అది జగన్‌ సొంత జిల్లా కాబట్టి. గ‌త అ సెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక‌.. ప్రతిప‌క్షం టీడీపీ ఆ జిల్లాలో అడ్రస్ కూడా లేకుండా పోయింది. అంతేకాదు.. గత ఎన్నిక‌ల త‌ర్వాత‌ టీడీపీ కీల‌క నేత‌లు గుండుగుత్తుగా పార్టీ మారి.. త‌లో దిక్కుకు పోయారు. దీంతో క‌డ‌ప‌పై చంద్రబాబు.. ఆయ‌న ప‌రివారం అంతా కూడా ఆశ‌లు వ‌దులుకున్నారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో టీడీపీ మ‌ద్దతుదారులు విజ‌యం సాధించారు. ఆ అంశం కాస్త ఇప్పుడు టీడీపీలో కొత్త ఆశలు పుట్టించింది. కానీ.. వైసీపీలో మాత్రం గుబులు రేపుతోంది. టీడీపీ గెలుచుకున్న స‌ర్పంచ్ స్థానాల సంఖ్య త‌క్కువే అయినా ఆ పార్టీ గెలుచుకున్నవి అన్నీ కీల‌క స్థానాలే.

    Also Read: చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు

    తొలి విడ‌త‌లో ఏకగ్రీవాలు పోనూ 155 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ మద్దతుదారులు 98 స్థానాల్లో పోటీ చేశారు. 30 స్థానాల్లో విజయం సాధించడం గ‌మ‌నార్హం. జిల్లాలో ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వ‌చ్చిన ఫ‌లితాలు.. టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. తొలివిడతలో 206 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 51 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 155 సర్పంచ్‌ స్థానాలకు పోటీ జరిగింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 19 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ మద్దతుదారులు 8 పంచాయతీల్లో మాత్రమే పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచారు.

    ఇక బద్వేలు నియోజకవర్గంలో 68 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. అందులో 12 స్థానాల్లో విజయం సాధించింది. జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన పోరుమామిళ్ల మేజ‌ర్ పంచాయ‌తీలో టీడీపీ అభ్యర్థి సుధాక‌ర్ నాయుడు 300 ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు 46 స్థానాల్లో పోటీ చేసి 10 పంచాయతీలను కైవసం చేసుకున్నారు.

    Also Read: బ్లాక్‌లో శ్రీవారి ప్రసాదం.. భక్తుల ఆగ్రహం

    పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను అధికార వైసీపీ తన ఖాతాలో వేసుకున్నా.. తక్కువ స్థానాల్లో పోటీ చేసి అధికార పార్టీని ఎదురొడ్డి 27.55 శాతం స్థానాలు దక్కించుకోవడం తెలుగుదేశం నేత‌ల్లో హుషారు నింపింద‌న‌డంలో సందేహం లేదు. అయితే.. త‌మ‌కు ప‌ట్టుకొమ్మగా ఉన్న జిల్లాలో అందునా.. సీఎం సొంత జిల్లాలో ప‌దేళ్లుగా టీడీపీకి అస్సలు ప్రాతినిధ్యం లేకున్నా ఇలా దూకుడుతో ముందుకు సాగ‌డం అధికార పార్టీ నేత‌ల‌కు నోటమాట రాకుండా అయింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్