
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై పంతం పట్టి మరీ ఆయనను దించేసి అందరూ మరిచిపోయిన ఆయన అన్న కూతురును ఢిల్లీ నుంచి రప్పించి మరీ వారి భారీ ఆస్తుల వారసురాలిగా ప్రకటించింది జగన్ సర్కార్. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవుల నుంచి కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో సంచయితను నియమిస్తూ జారీ చేసిన ఏపీ హైకోర్టు జీవోను ఏపీ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. తిరిగి అశోక్ గజపతిరాజునే ఈ రెండు ట్రస్ట్ లకు చైర్మన్ గా నియమించాలని కోర్టు ఆదేశించింది. సంచయిత నియామకాన్ని రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ పరిణామం జగన్ సర్కార్ కు షాకింగ్ గా మారింది.
సంచయితను చైర్మన్ గా సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటీషన్ పై ఈ మేరకు తీర్పు వెలువరించారు. గత ఏడాది మార్చిలో సింహాచలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ఆనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించింది. ఆ మారునాడే విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా ఆమెనే నియమించడంతో వివాదం మొదలైంది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్టు జీవో పేర్కొంది.
అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను హైకోర్టు కొట్టివేసింది. సింహాచలమ వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు ఆయనే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు ఇచ్చింది. గతంలో మానస ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించిన ప్రభుత్వానికి ఈ పరిణామం షాకింగ్ మారింది. అశోక్ గజపతిపై కోపంతో చేసిన ఈ నియామకం చెల్లకపోవడంతో ఇప్పుడు జగన్ సర్కార్ ఎంతో పట్టుబట్టి చేసిన ఈ నియామకం చెల్లకుండా పోయింది. ప్రభుత్వ పరువు గంగలో కలిసిపోయింది.
అశోక్ గజపతిని గద్దెదించాలన్న జగన్ పంతం నెరవేరుకుండా పోయింది. ఇక సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన ధర్మాసనం ఆమెను పదవి నుంచి దించేసింది. దీంతో ఇన్నాళ్లు అశోక్ గజపతిపై కక్ష సాధించిన జగన్ సర్కార్, సంచయిత లు ఇద్దరూ అశోక్ గజపతి ముందు ఓడిపోయారనే చెప్పొచ్చు. హైకోర్టు ఆదేశాలతో మానస ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్ గా బాధ్యతలు అశోక్ గజపతి రాజు స్వీకరించనున్నారు. ఈ పరిణామం జగన్ కు మింగుడు పడదనే చెప్పాలి. అశోక్ గజపతిని వ్యతిరేకించే ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరీ.