https://oktelugu.com/

చైనాకు షాక్: సరిహద్దుల్లో నిశ్శబ్ధ మిసైల్ దించిన భారత్

డీఆర్డీఏ ఏడేళ్లుగా పరిశోధన చేసి తయారు చేసిన నిర్భయ్ క్షిపణి సైన్యంలో చేరడంతో భారత సైన్యానికి కొండంత అండ లభించింది. సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతూ చైనా మిసైళ్లను మోహరించిన వేళ వాళ్లకు షాకిస్తూ నిర్భయ్ ని రంగంలోకి దింపారు. దీంతో చైనా వెన్నులో వణుకుపుట్టేలా భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోంది. నిర్భయ్ క్షిపణులు భారత అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రాలుగా ఇప్పుడు మారాయి. Also Read : బరిలో టీడీపీ.. తెలంగాణలో డిపాజిట్లు వస్తాయా..? భారత రక్షణ పరిశోధన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 / 08:00 PM IST
    Follow us on

    డీఆర్డీఏ ఏడేళ్లుగా పరిశోధన చేసి తయారు చేసిన నిర్భయ్ క్షిపణి సైన్యంలో చేరడంతో భారత సైన్యానికి కొండంత అండ లభించింది. సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతూ చైనా మిసైళ్లను మోహరించిన వేళ వాళ్లకు షాకిస్తూ నిర్భయ్ ని రంగంలోకి దింపారు. దీంతో చైనా వెన్నులో వణుకుపుట్టేలా భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోంది. నిర్భయ్ క్షిపణులు భారత అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రాలుగా ఇప్పుడు మారాయి.

    Also Read : బరిలో టీడీపీ.. తెలంగాణలో డిపాజిట్లు వస్తాయా..?

    భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తయారు చేసిన ‘నిర్బయ్ మిసైల్ ’కు నిశ్శబ్ధ విధ్వంస క్షిపణిగా పేరుంది. ఇది టార్గెట్లను ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతుందని పేరుంది. 6 మీటర్ల పొడువుండే నిర్భయ్ పరిధి గరిష్టంగా 1000 కిలోమీటర్లు రేంజ్ లో నాశనం చేస్తుంది. టిబెట్ లోని చైనా సైనిక స్థావరాలను ఈ క్షిపణి నాశనం చేయగలదు.

    భారత్ చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరుగుతున్న వేళ సైన్యంలోకి ‘నిర్భయ్’ క్షిపణులు చేరడం భారత సైన్యానికి కొండంత బలంగా మారాయి. . రెండు దేశాలు యుద్ధ సామగ్రిని భారీగా మోహరిస్తున్నాయి. తాజాగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లఢక్ సరిహద్దుల్లో చైనా సైన్యం ‘సర్వేష్ టు ఎయిర్ మిసైళ్లు(ఎస్ఏఏం) లను మోహరించింది. దీంతో చైనాకు ధీటుగా భారత్ తాజాగా అత్యాధునిక, సరికొత్త ‘నిర్భయ్ మిస్సైల్’ను తరలించింది. నిర్భయ్ తోపాటు ప్రఖ్యాత బ్రహ్మోస్, ఆకాష్ (సర్ఫేస్ టు ఎయిర్) మిసైళ్లను ఎల్ఏసీ వద్ద భారత్ మోహరించి చైనాకు షాకిచ్చింది.

    Also Read : టాప్‌ ప్లేస్‌లో ఎన్‌టీవీ.. సెకండ్‌కు పడిపోయిన టీవీ9?