spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan Kodi kathi Case: ఎన్ఐఏ కోర్టుకు జగన్.. ఆ కేసులో ట్విస్ట్..

CM Jagan Kodi kathi Case: ఎన్ఐఏ కోర్టుకు జగన్.. ఆ కేసులో ట్విస్ట్..

CM Jagan Kodi kathi Case: కోడి క‌త్తి కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఎన్ఐఏ కోర్టు కీల‌క ఆదేశాలు ఇచ్చింది. నిందితుడు జ‌నిప‌ల్లి శ్రీనివాస్ బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌రించింది. బాధితుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోర్టుకు రావాలంటూ ఆదేశాలిచ్చింది. జ‌న‌వ‌రి 31 నుంచి కోడిక‌త్తి కేసు విచార‌ణ‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించింది.

CM Jagan Kodi kathi Case
CM Jagan Kodi kathi Case

2019లో పాద‌యాత్ర చేసుకుని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు. ఆ సంద‌ర్భంగా జ‌నిప‌ల్లి శ్రీనివాస్ అనే వ్య‌క్తి జ‌గ‌న్ పై కోడిక‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. విశాఖ‌లో ప్ర‌థ‌మ చికిత్స చేయించుకుని .. హైద‌రాబాద్ ఆస్ప‌త్రిలో ఆయ‌న అడ్మిట్ అయ్యారు. కోడిక‌త్తి కేసును ఎన్ఐఏకు అప్ప‌గించారు. అప్ప‌టి నుంచి ఎన్ఐఏ కేసు ద‌ర్యాప్తు చేస్తోంది. నిందితుడు శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగా జైల్లో కొన‌సాగుతున్నాడు.

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ తల్లిదండ్రులు ఇటీవ‌ల సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లారు. బెయిల్ పిటిష‌న్ కోసం జ‌గ‌న్ నుంచి ఎన్వోసీ తీసుకున్నారు. బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేశారు. కానీ విజ‌య‌వాడ ఎన్ఐఏ కోర్టు బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌రించింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కోడిక‌త్తి కేసులో బాధితుడు ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టుకు రాక‌పోవ‌డం పై న్యాయస్థానం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. కోర్టు టేప్ రికార్డ‌ర్ లా వ్య‌వ‌హ‌రించ‌బోద‌ని తేల్చి చెప్పింది. కేసులో బాధితుడిని ఇంత వ‌ర‌కు ఎందుకు విచారించ‌లేద‌ని నిందితుడు త‌ర‌పు న్యాయ‌వాది స‌లీమ్ ఎన్ఐఏ ను ప్ర‌శ్నించారు. స్టేట్ మెంట్ రికార్డు చేశామ‌ని ఎన్ఐఏ న్యాయ‌వాది సమాధానం ఇచ్చారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తే చార్జిషీట్ లో ఎందుకు లేద‌ని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు. బాధితుడిని విచారించ‌కుండా సాక్ష్యుల్ని విచారిస్తే ఏం లాభం ఉంటుంద‌ని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు.

CM Jagan Kodi kathi Case
CM Jagan

కోడిక‌త్తి కేసులో మొత్తం 56 మందిని విచారిస్తే 1 నుంచి 12 వ‌ర‌కు ఉన్న వారి వాంగ్మూలాలు ఎందుకు లేవ‌ని న్యాయ‌మూర్తి ఎన్ఐఏ త‌ర‌పు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించారు. జ‌న‌వ‌రి 31 నుంచి విచార‌ణ షెడ్యూల్ ను కోర్టు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో బాధితుడు వైఎస్ జ‌గన్ త‌ప్ప‌కుండా హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. దీంతో జ‌గ‌న్ ఎన్ఐఏ కోర్టు మెట్లు ఎక్కే ప‌రిస్థితి త‌ప్పేలా లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version