Sharmila: ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా జగన్, షర్మిల వ్యవహారం ఉంటుంది. అన్నతో విభేదించిన షర్మిల ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెట్టింది. అయితే ఇక్కడ నిరసనలు, పాదయాత్రలు అంటూ హోరెత్తించిన షర్మిల ఇప్పుడు ఏపీలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే ఏపీలో పార్టీ పెట్టే ఆలోచనలో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వార్త వైసీపీని కుదిపేస్తంది. అదేంటంటే వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐకి షర్మిల లేఖ రాయనున్నట్టు ప్రచరాం జరుగుతోంది.

అదే జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ ఖాయం అని వార్తలు వస్తున్నాయి. షర్మిల ఎప్పుడూ ఇంత కోపంగా లేదని, కాగా అన్నతో జరిగిన కొన్ని కారణాల వల్లే ఇలా చేస్తోందనే పుకార్లు వస్తున్నాయి. మొన్న క్రిస్మస్ సందర్భంగా ఒక చోట కలిసిన షర్మిల, జగన్ మధ్య మరోసారి ఆస్తుల గొడవ జరిగినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకే ఆమె సీబీఐకి లేఖ రాసేందుకు రెడీ అయిందని తెలుస్తోంది.
Also Read: తమ రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేసిన 9 మంది స్టార్లు వీళ్ళే !
అయితే ఇదే క్రమంలో ఆమె ఏపీలో కూడా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. త్వరలోనే ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కూడా కలిసే ఛాన్స్ ఉందంట. ఇలా ఆమె అన్ని విధాలుగా అన్న జగన్‌ను టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మొత్తానికి షర్మిల చేస్తున్న శపథాలు జగన్‌ను ఇరకాటంలో పడేసేటట్టు ఉన్నాయి. మరి జగన్ మీద ఇంతలా కోపానికి రావడానికి రెండు కారణాలు ఉన్నట్టు సమాచారం. ఒకటి ఆస్తుల విషయం అయితే రెండోది రాజకీయంగా తనకు ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేయడం. దాంతో అప్పటి నుంచి విజయమ్మ ఫ్యామిలీ మాత్రం షర్మిలకే ఫుల్ సపోర్టు చేస్తోంది. ఆమె ఏం చేసినా వెనకుండి నడిపిస్తోంది. మరి జగన్ మీద షర్మిల బాణం ఎక్కుపెడుతుందా లేదా అన్నది చూడాలి.
Also Read: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి రానున్న ఆ హీరో… ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా!