Sharing Autos Ban: పార్కింగ్ ప్రాబ్లం.. జంట నగరాల్లో షేర్ ఆటోలపై నిషేధం.. వ్యతిరేకిస్తున్న జనం!

Sharing Autos Ban: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ లో షేర్ ఆటోలపై నిషేధం విధిస్తూ.. నగర ట్రాఫిక్ ఏసీపీ నిర్ణయించారు. షేరింగ్ ఆటోలు, ప్యాసింజర్ ఆటోలు అసురక్షిత పద్ధతులు, అలాగే రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు ఆపే విధానం, రోడ్లపై వారి ఇష్టం వచ్చినట్లు ఆటోలను పార్కింగ్ చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిసై సమావేశం నిర్వహించిన ట్రాఫిక్ ఏసీపీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో షేర్‌ ఆటోలపై నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. […]

Written By: Raghava Rao Gara, Updated On : March 8, 2023 2:08 pm
Follow us on

Sharing Autos Ban

Sharing Autos Ban: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ లో షేర్ ఆటోలపై నిషేధం విధిస్తూ.. నగర ట్రాఫిక్ ఏసీపీ నిర్ణయించారు. షేరింగ్ ఆటోలు, ప్యాసింజర్ ఆటోలు అసురక్షిత పద్ధతులు, అలాగే రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆటోలు ఆపే విధానం, రోడ్లపై వారి ఇష్టం వచ్చినట్లు ఆటోలను పార్కింగ్ చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిసై సమావేశం నిర్వహించిన ట్రాఫిక్ ఏసీపీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో షేర్‌ ఆటోలపై నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు.

పేద, మధ్య తరగతి వర్గాలు వినియోగించే ఆటోలపై జంట నగరాల్లో ఇప్పటికే నిషేధం అమలులో ఉంది. జంట నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రభుత్వం ఆటోల అమ్మకాలు రిజిస్ట్రేషన్ నిషేధించింది. దీంతో హైదరాబాదులో కొత్తగా ఆటోల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిచిపోయింది.

నిషేధాన్ని ఎత్తేసి, నూతన ఆటోల రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌(టీటీడబ్ల్యూయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. రోడ్లు ఇరుకుగా ఉండటం.. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఆటోలతో ట్రాఫిక్‌, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం ఆటోలను నియంత్రించేందుకు రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.

తాజాగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు..
– తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీసులు… జంట నగరంలో ట్రాఫిక్కు ప్రధాన కారణం ఆటోలే అని గుర్తించారు. ఆటోలు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడం, రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతుండడంతో పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు.

పేద మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు..
ఆటోలపై నిషేధం విధించడంతో జంట నగరాల్లోని పేద మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారింది. గంట నగరాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వచ్చేవారు ప్రయాణానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్యాబ్ చార్జీలు ఎక్కువగా ఉండడం సామాన్యులకు భారంగా మారుతుంది. దీంతో ఆటోలపై నిషేధాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం పున ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Sharing Autos Ban

రోడ్డున పడుతున్న డ్రైవర్ల కుటుంబాలు
జంట నగరాలు ఆటోలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంతో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. జంట నగరాల్లో ఆటోల ద్వారా సుమారుగా 15 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరంతా ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

Tags