Nellore Police: చట్టాన్ని కాపాడాల్సిన వారే ఉల్లంఘిస్తే ఎలా? రక్షణ కల్పించాల్సిన పోలీసులకే కష్టం వస్తే ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరితో గోడు వెళ్లబోసుకోవాలి? నెల్లూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కుట్టే పనిని ఓ జెంట్స్ టైలర్ కు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు. మహిళలకు జెంట్స్ టైలర్ ను నియమించడంలో అర్థమేమిటని మండిపడుతున్నారు. తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఎవరున్నారని వాపోతున్నారు.

మహిళలకు జెంట్స్ టైలర్ తో కొలతలు తీయించడం ఇబ్బందిగా మారింది. దీనిపై ఆందోళనలు రేగినా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ గా మారుతోంది. పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విచారణ కొనసాగుతుందని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు.
Aloso Read: కులాల కుంపటిలో యూపీ ఎన్నికలు
మహిళల యూనిఫాం కుట్టడానికి ఓ అవుట్ సోర్సింగ్ ను ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అయితే ఇదంతాచూసుకోవాల్సిన ఉన్నతాధికారులే పట్టించుకోకపోవడంతో జెంట్స్ టైలర్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించి చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. కానీ జెంట్స్ టైలర్ పై నెటిజన్లు సైతం స్పందించారు.మహిళా కానిస్టేబుళ్లకు రక్షణ లేదా అని పోస్టులు పెడుతున్నారు.

ఇదో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై దర్యాప్తు జరిపించి అందరిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.మహిళా కానిస్టేబుళ్ల వ్యవహారంలో ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నా ఇంత నిర్లక్ష్యం పనికి రాదనే భావన అందరిలో వస్తోంది. దీనిపై సమూలంగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ తతంగం ఓ గుణపాఠంగా పోలీసులకు మారనుందని తెలుస్తోంది.
Aloso Read: యూట్యూబర్ ‘సరయూ’ హాట్ ఓవర్ యాక్షన్ కు తగిన శాస్తి !
[…] Also Read: మహిళా కానిస్టేబుళ్లకు జెంట్స్ టైల… […]