Pawan Kalyan Bus Yatra: ఏపీలో రాజకీయ హీట్ ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా 17 నెలల వ్యవధి ఉన్నా అన్ని రాజకీయ పక్షాలు దూకుడు పెంచాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు అధికార పక్షం కూడా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి విజయం సాధించాలన్న ప్రయత్నంలో ఉంది. అటు ప్రధాన విపక్షం టీడీపీదైతే జీవన్మరణ సమస్యే. వచ్చే ఎన్నికలు ఆ పార్టీకి కీలకం. విజయం సాధించకపోతే పార్టీ కకావికలమయ్యే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా కీలక నిర్ణయాలు దిశగా అడుగులేస్తున్నారు. గతంలో మాదిరిగా నాన్చుడి ధోరణితో కాకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర ముందుగానే పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పొత్తులు, పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ లో పెడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు ఖరారు చేశారు. మరో 100 నియోజకవర్గాలను సైతం టిక్కెట్లను ఖరారు చేసి…నేతలకు పనిచేసుకోమని పురమాయించారు.

వారి పరిస్థితి ఏమిటి?
అయితే అంతవరకూ బాగానే ఉంది కానీ.. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బహుముఖ నాయకత్వం ఉంది. అందులో ఇరువర్గాలు టిక్కెట్లను కోరుతూ వస్తున్నాయి. అయితే అటువంటి చోట మాత్రం ఏ విధంగా ముందుకెళ్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియడం లేదు. ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం మరోవర్గం పార్టీకి దూరమయ్యే అవకాశమైతే ఉంది. ప్రధానంగా కోస్తా, ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. అయితే తమకు టిక్కెట్ ఖరారు కాని పక్షంలో మాత్రం మరో వర్గం ప్రత్యామ్నాయం ఎంచుకునే అవకాశం ఉంది.ప్రజావ్యతిరేకత దృష్ట్యా అధికార వైసీపీలోకి చేరారు. అక్కడ ఇప్పటికే సిట్టింగ్ లు ఉన్నారు. బీజేపీకి వెళదామంటే ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో బలం లేదు. అందుకే వారంతా జనసేనను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఇప్పటికే జనసేన కీలక నాయకులకు టచ్ లోకి వెళుతున్నారు. పార్టీలో చేరుతామంటూ వర్తమానాలు పంపుతున్నారు. అయితే జనసేన నేతలు మాత్రం అచీతూచీ వ్యవహరిస్తున్నారు.
Also Read:
Chandrababu- Vangaveeti Radha Krishna: చంద్రబాబుకు భారీ షాక్.. త్వరలోనే జనసేనలోకి ఆ సంచలన నేత
అధికార పక్షంలోనూ హీట్…
అటు అధికార పక్షం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనుమానపు చూపులు చూస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, పాలనా వైఫల్యాలను ఎమ్మెల్యేలపై పెట్టే ప్రయత్నం చేస్తోంది. నేను బాగానే పాలిస్తున్నా.. మీ పనితీరే బాగాలేదంటూ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారు. ఇటీవల ఈ నిందారోపణలు అధికమయ్యాయి. అదే సమయంలో ఎమ్మెల్యేలను అవమానించే రీతిలో నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పురమాయిస్తున్నారు..ప్రోత్సహిస్తున్నారు. 50కు పైగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా అదనపు సమన్వయకర్తలను నియమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చేతిలోకి నిధులు ఇవ్వకుండా గ్రాఫ్ పెంచుకోవాలని సీఎం జగన్ సూచించడాన్ని చూసి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమను పొమ్మన లేక పొగ పెడపెడుతున్నారని మనస్తాపానికి గురవుతున్నారు. అందుకే పక్కచూపులు చూడడం ప్రారంభించారు. ఇందుకు జనసేన సరైన వేదికగా భావిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నాయకులు పవన్ కు టచ్ లోకి వెళ్లారు. ఆయన జన్మదినోత్సవాలకు సైతం హాజరయ్యారు. నేరుగా శుభాకాంక్షలు తెలిపారు. రాజోలుకు చెందిన సీనియర్ నాయకుడు బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరనున్నట్టు ప్రకటించారు. మరికొద్ది నెలల్లో వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు పెరిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.

పవన్ కు టచ్ లోకి ఇరు పార్టీల నేతలు…
అయితే పవన్ కళ్యాణ్ అక్టోబరు నుంచి చేపట్టనున్న బస్సు యాత్ర అటు అధికార, ఇటు ప్రధాన విపక్షంలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బస్సు యాత్రలో భారీగా చేరికలు ఉండే అవకాశమైతే మాత్రం కనిస్తోంది. ఇరు పార్టీలకు చెందిన చాలామంది కీలక నాయకులు జనసేన అధినేతను సంప్రదించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకూ బస్సు యాత్రకు సంబంధించి షెడ్యూల్ వెల్లడించలేదు. కానీ పవన్ బస్సుయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ చైతన్య రథం మాదిరిగా.. ప్రజలకు ఆకట్టుకునేలా వాహనాన్ని ముంబాయిలో తయారుచేస్తున్నారు. టీటైమ్ డిజైన్ రూపకర్తకు బాధ్యతలు అప్పగించారు. బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారుకాగానే ఇతర రాజకీయ పక్షాల నుంచి చేరికలకు కూడా జనసేన అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read:Samantha: హిందీలో సమంత క్రేజీ సినిమా.. వైరల్ అవుతున్న షేకింగ్ న్యూస్