Kumbh Mela 2025: ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh state) రాష్ట్రంలో ప్రయాగ్ రాజ్(prayagraj) ప్రాంతంలో గంగా నదిలో మహా కుంభమేళా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికే కోట్లల్లో భక్తులు స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. తొక్కిసలాటలు జరుగుతున్నప్పటికీ.. అందులో ప్రయాణికుల ప్రాణాలు పోతున్నప్పటికీ.. యాత్రికులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా అంతకంతకు పెరుగుతున్నారు. వచ్చిన వారందరికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో.. పుకార్లు వ్యాపించడంతో తొక్కిసలాట జరుగుతుంది.. అయితే మహాకుంభమేళాకు వెళ్లే మార్గాలన్నీ ప్రస్తుతం కిక్కిరిసిపోయాయి. దీంతో మహాకుంభమేళాకు వెళ్లడం దాదాపు కష్టంగా మారింది. ఈ క్రమంలో బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరు యువకులు మహా కుంభమేళాకు వెళ్లిన తీరు మీడియా, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ వారు మహా కుంభమేళకు ఎలా వెళ్లారంటే..
ఇలా వెళ్లిపోయారు
మహా కుంభమేళాకు వెళ్లే రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైళ్లలో వెళ్లాలంటే సాధ్యం కాదు. న్యూ ఢిల్లీలో జరిగిన ఘటన తర్వాత రైళ్లల్లో ప్రయాణం చేయాలంటేనే యాత్రికులు జంకుతున్నారు. పోనీ ఫ్లైట్లో వెళ్లిపోదామంటే ఆర్థిక పరిస్థితి సహకరించదు. అందువల్లే బీహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది యువకులు ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ ప్రాంతం నుంచి త్రివేణి సంగమం వరకు 248 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరాన్ని వారు పడవ మీదుగానే ప్రయాణం చేశారు.. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆ వీడియోకు రెండు లక్షల వరకు లైక్స్ వచ్చాయి. అయితే జనవరి 13న మహాకుంభమేళా మొదలైంది. ఈనెల 26 వరకు జరుగుతుంది. కుంభమేళకు వెళ్లే రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయాయి. ఎక్కడికి ఎక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడుతున్న నేపథ్యంలో.. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ప్రయాగ్ రాజ్ ప్రాంతాన్ని చేరుకోవడం కష్టమవుతోంది. మరోవైపు రైళ్లలో కుంభమేళా వెళ్లాలంటే ఇబ్బంది ఎదురవుతుంది. అందువల్లే తట్టుకోలేక వారు ఇలా నాటు పడవల ప్రయాణించి గంగానదిలో మూడు మునకలు వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రయాణమయ్యారు. 248 కిలోమీటర్ల ప్రయాణించి గంగా నదిలో స్నానం చేశారు. ” మహా కుంభమేళా లో పాల్గొనాలని.. గంగా నదిలో స్నానం చేయాలని ఎప్పటినుంచో ఉంది. కాకపోతే మా ఆర్థిక పరిస్థితి దానికి సహకరించదు. రోడ్డు మార్గాన వెళ్లే పరిస్థితి లేదు. ఫ్లైట్ లో ప్రయాణించే అదృష్టం లేదు. పోనీ రైళ్లల్లో వెళ్దామంటే విపరీతమైన రద్దీ ఉంది. అందువల్లే జల రవాణా మార్గాన్ని ఎంచుకున్నామని.. చివరికి గంగా నదిలో మూడు మునకలు వేసామని” బీహార్ రాష్ట్రానికి చెందినవారు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో స్నానం చేయడానికి బీహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది యువకులు 248 కి.మీ పడవ ద్వారా ప్రయాణించి.. గంగా నదిలో మూడు మునకలు వేశారు.#MahaKumbhMela2025#Gangariver#UttarPradesh pic.twitter.com/KH1ImNnJlr
— Anabothula Bhaskar (@AnabothulaB) February 16, 2025