నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందుపై హైకోర్టులో సంచలన పిటీషన్ దాఖలైంది. పిటీషన్ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరుఫున ఈ పిటీషన్ దాఖలు చేశారు.
కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారని.. ఈ మందు తీసుకొని అనేక మందు కోలుకున్నారని పిటీషన్ పేర్కొన్నారు. అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిందని.. దీనివల్ల అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని పిటీషనర్ హైకోర్టుకు తెలిపారు.
ఈ విషయమై విచారణకు అనుమతించాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ పిటీషన్ విచారణపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
ఆనందయ్య ఆయుర్వేద మందులో ఎలాంటి హానికర పదార్థాలను వాడడం లేదని ఆయుష్ శాఖ తేల్చింది. అయితే ఐసీఎంఆర్ ధ్రువీకరణ కోసం దీన్ని ఆపేశారు. అయితే దీనివల్ల కరోనా రోగులకు నయం అవుతుండడంతో వెంటనే ఈ మందు పంపిణీ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేశారు.