Mahesh Babu- Janasena: తెలుగు సినీ పరిశ్రమలో పవన్, మహేష్ బాబులు మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరూ తమ తమ సినిమాలకు వాయిస్ ఓవర్ లు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇద్దరు మనస్తత్వాలు దాదాపు ఒక్కటే. ఇద్దరిదీ ఎంతో సింప్లిసిటీ. ప్రస్తుతం పవన్ సినిమాలతో పాటు రాజకీయాల్లో ఉన్నారు. అటు మహేష్ బాబు సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా కొనసాగుతున్నాయి. అయితే స్నేహితుడు పవన్ జనసేనకు మహేష్ బాహటంగా మద్దతు ప్రకటించారని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి సినిమారంంలో బిజీగా ఉన్న మహేష్ ముందుగా కుటుంబసభ్యులను జనసేనలోకి పంపించనున్నట్టు సమాచారం. ఇంటర్నల్ గా సపోర్టు చేసి స్నేహితుడి పార్టీ పవర్ లోకి రావాలని మహేష్ బాబు కోరుకుంటున్నారుట.

ముందుగా మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ జనసేనలో చేరనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఇది పొలిటికల్, సినిమారంగంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ ఘట్టమనేని వారి కోడలుగా క్రియాశీలక పాత్ర వహించిన ఆమె.. రాజకీయ యవనికపై అడుగు పెట్టడం ఆసక్తిగా మారింది.ఘట్టమనేని కుటుంబసభ్యలకు రాజకీయాలు కొత్త కావు. సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర వహించారు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కూడా కృష్ణ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండేవారు. అటు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు సైతం కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కొనసాగారు. వీరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆత్మీయ అనుబంధం ఉండేది. వైసీపీ ఆవిర్భావం తరువాత కృష్ణ కుటుంబం జగన్ వెంటే ఉండేది. ఆదిశేషగిరిరావు వైసీపీలో చాలా యాక్టివ్ గా పనిచేశారు. కానీ వారికి తగ్గ ప్రాధాన్యం దక్కకపోవడంతో 2019 ఎన్నికల ముందు ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు.

కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఆమె తల్లి గల్లా అరుణకుమార్ మాజీ మంత్రి. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ బాధ్యురాలిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం కుటుంబమంతా టీడీపీలోనే ఉంది. అయితే మహేష్ భార్య నమ్రతా మాత్రం జనసేన వైపు మొగ్గుచూపుడానికి మహేషే కారణంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసే వెళుతుందని.. కీలక నియోజకవర్గాల్లో తటస్థులు, సెలబ్రెటీలు అడుగుపెడితే సునాయాస విజయం పొందే అవకాశం ఉంది. అందులో భాగంగానే నమ్రత శిరోద్కర్ జనసేన వైపు మొగ్గుచూపినట్టు సమాచారం. అదే జరిగితే ఘట్టమనేని వారి కోడలు చట్టసభల్లో అడుగుపెట్టే చాన్స్ ఉందన్న మాట..జనసేనకు ఇప్పటికే మెగా స్టార్ అభిమానుల అండ ఉంది. అటు మెగా కాంపౌండ్ వాల్ లోని అందరు హీరోలు ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇప్పడు వారికి మహేష్ బాబు తోడవుతారన్న వార్త జన సైనికులను ఆనందంలో ముంచెత్తుతోంది.