Real Estate: ఇటీవల కాలంలో బ్లాక్ మనీ పట్టుబడటం కొత్తేమీ కాదు. రూ. కోట్లు హవాలా మార్గంలో సంపాదించి వాటిని రియల్ వ్యాపారంలో పెడుతూ కోట్లు గడించడం మామూలే. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. కానీ ప్రస్తుతం పట్టుబడిన నగదు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సమూహది కావడం విశేషం. గత ఇరవై నెలల క్రితమే సంస్థ ఏర్పాటైనా ఇంత అనతి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది. రెండు రోజులుగా ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 70 కోట్ల నగదు దొరికినట్లు తెలుస్తోంది.

అసలు ఈ సంస్థ ఎవరిది? రాజకీయ నాయకుడిదా? లేక ఇంకా ఎవరిదా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో దర్యాప్తు సాగుతున్నా మిస్టరీగానే మారుతోంది. దీనిపై ఐటీ అధికారులు కూడా పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇద్దరు మహిళలు అనితా నేనా, అనురూప కుర్రా డైరెక్టర్లుగా ఉండటం తెలిసిందే.
Also Read: ఎంత గొప్ప న్యూస్.. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గింపు.. త్వరపడండి..
ఏదైనా బడా రియల్ ఎస్టేట్ కు బినామీనా లేక రాజకీయ నాయకుడికి బినామీ అనేది తేలాల్సి ఉంది. ఇంత భారీ మొత్తంలో నగదు లభించడంతో అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఇంకా వివరాలు మాత్రం వెల్లడి కావడం లేదు. దీంతో ఇంకా ఎంత మొత్తంలో నగదు వీరి వద్ద ఉందో తెలియడం లేదు. దొరికింది మాత్రమే రూ. 70 కోట్లు కాగా ఇంకా దొరకనిది ఎంత ఉందో అనే విషయాలు అంతుచిక్కడం లేదు.
ఇంతకీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఐటీ అధికారులు ఆరా తీసినా అసలు నిజాలు మాత్రం దొరకడం లేదు. దీంతో హవాలా డబ్బుగా నిర్ధారిస్తున్నారు. ఈ నగదును స్వాధీనం చేసుకున్నా ఇంకా ఎంత దొరుకుతుందో అని ఆరా తీస్తున్నారు. సంస్థ మనుగడ ఎలా వెలుగులోకి వచ్చిందనే దానిపై విచారణ చేపడుతున్నారు.
Also Read: వాటర్, ఆయిల్ ట్యాంకర్లు రౌండ్ గా ఉండటానికి కారణాలేంటి?