spot_img
Homeజాతీయ వార్తలుSecret Dating Apps: చాటు పని కోసం మాటుగా.. చీకట్లో చితక్కొట్టుడుకు ఇంత ముఖం వాచి...

Secret Dating Apps: చాటు పని కోసం మాటుగా.. చీకట్లో చితక్కొట్టుడుకు ఇంత ముఖం వాచి ఉన్నారా..

Secret Dating Apps: అసలు ఆ పని ఒక చండాలం. అత్యంత దారుణం.. పరమ నీచాతి నీచం. అటువంటి దానికోసం భారతీయులు ముఖం వాచిపోయి ఉన్నారు. అందువల్లే దిగజారి పోతున్నారు. కనీసం విలువలకు మంగళం పాడేస్తున్నారు. వలువలు ఎప్పుడు ఇప్పుదామంటూ కుతూహలంగా ఉన్నారు.

మన దేశంలో ఇటీవల కాలంలో సీక్రెట్ డేటింగ్ ట్రెండ్ అనేది పెరిగిపోయింది. ఇది ఎంతలా ఉందంటే రోజురోజుకు ఈ తరహా యాప్స్ లో చాలామంది ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య దాదాపు 6 కోట్ల ఒక లక్ష వరకు చేరుకుంది. ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే ఆ యాప్స్ నిర్వాహకులు ఏ స్థాయిలో దందా సాగిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో 4.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉంటే.. గత ఏడాది 1.6 కోట్లమంది చేరడం ఆందోళన కలిగిస్తోంది.

ఇందులో చేరిన వారిలో బ్యాచిలర్లు ఎక్కువగా ఉంటున్నారు. అదే సమయంలో పెళ్లయిన వారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. వివాహితులు కూడా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో చేరిన వారు ఎక్కువగా వివాహేతర సంబంధాల వైపు ఆసక్తి చూపిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూజర్ల బలహీనతను యాప్ నిర్వాహకులు కూడా క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. వీటి ఆధారంగా కోట్ల వ్యాపారం జరుగుతోంది.

కొన్ని యాప్స్ నిర్వాహకులు ఏకంగా ప్రీమియం అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. నచ్చిన అబ్బాయిని లేదా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం.. ఆ తర్వాత ఓయో రూములలో ఎంజాయ్ చేసే సౌలభ్యం కల్పిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఈ తరహా యాప్స్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. మొదట్లో లక్షల కు మాత్రమే పరిమితమైన వీటి వ్యాపారం.. ఇప్పుడు కోట్లకు చేరుకుంది. ఈ తరహా యాప్స్ చాలావరకు మసాజ్ సెంటర్లు.. స్పా సెంటర్లతో లింక్ అయి ఉన్నాయని తెలుస్తోంది. దీనిని బట్టి చీకటి వ్యాపారానికి వెలుతురు కోణం ఇచ్చినట్టు అర్థమవుతుంది.

ఈ తరహా యాప్స్ ద్వారా వ్యవహారాలు సాగించడం ప్రమాదకరమని.. ఆ తర్వాత అనేక రకాల కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇటువంటి బంధాలకు దూరంగా ఉండాలని.. ఇటువంటి యాప్స్ వాడకూడదని అంటున్నారు. అయితే వీటిపై కూడా నిషేధం విధిస్తే చాలా వరకు యువత దారి తప్పకుండ ఉండాలని నిపుణులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular