Site icon OkTelugu

నేను బాగానే ఉన్నా: ట్రంప్‌

తన ఆరోగ్యం ఇప్పుడు మెరుగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ట్రంప్‌కు కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ఆయనే ఓ వీడియోను చిత్రీకరించి ట్విట్టర్‌ ద్వారా పోస్టు చేశారు. ప్రస్తుతం ఆయన వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను అసుపత్రికి వెళ్లినప్పుడు ఆరోగ్యం బాగా లేదని, అయితే వైద్యులు చేసిన చికిత్సకు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. అఇయతే నేను కరోనా వైరస్‌తో పొరాడుతున్నాను. దానిని ఎలాగైనా ఓడిస్తానని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?

Exit mobile version