
Satellite Internet: ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన నెట్ వాడకం గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరిస్తోంది. అయితే మొబైల్ విప్లవం రాకముందు కేబుల్ ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారు. ఇది అందరికీ అందుబాటులోకి రాకపోగా.. ఖర్చుతో కూడుకునేది. జియో ఫోన్ల వాడకం పెరిగిన తరువాత ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. డేటా ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో అందరూ దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. కానీ మారుమూల గ్రామాల్లో, సముద్రాలపై ప్రయాణించేవారికి, దట్టమైన అడవుల్లోకి ఇంకా నెట్ విప్లవం చొచ్చుకుపోలేదు. కానీ ఇప్పుడు భూమ్మీద ఎక్కుడున్నా ఇంటర్నెట్ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నిస్తున్నారు. అదెలాగో చూడండి..
శాటిలైట్ ఇంటర్నెట్.. ఇప్పటి వరకు శాటిలైట్ డిష్ ను చూశాం.. శాటిలైట్ సినిమా గురించి తెలుసుకున్నాం.. ఇప్పుడు అందుబాటులోకి శాటిలైట్ ఇంటర్నెట్ కూడా రాబోతుంది. అంటే భూమ్మీద ఎక్కడున్నా ఇక నెట్ వాడుకోవచ్చన్నమాట. అంటే డిష్ టీవీకి అమర్చిన గొడుగు మాదిరిగానే.. ఇంటర్నెట్ వాడుకోవడానికి కూడా అందిస్తారన్నమాట. దీని ద్వారా ఏ మూలన ఉన్నా ఇంటర్నెట్ మనకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే స్టార్ లింక్ అనే శాటిలైట్ సంస్థ ఆ ప్రయోగం చేసింది. లియోలోకి శాటిలైట్ ను పంపించి దాని నుంచి భూమ్మీద అమర్చిన డిష్ ద్వారా ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బ్రిటన్ కు చెందిన వన్ వెబ్ అనే కంపెనీ ఇలాంటి వ్యవస్థను 2022 కల్లా పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తెస్తానని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశానికి చెందిన భారతి ఎయిర్ టెల్ కంపెనీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంది. ‘భూమి నుంచి అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్య నుంచి శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే అవకాశం కలగడం ఆనందంగా ఉంది’ అని ప్రయోగంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఎలన్ అన్నారు. అయన ప్రయోగం చేసిన తీరును వివరించారు. ‘ఇంటర్నెట్ ను అందించే లక్ష టెర్మినళ్లను నింగిలోకి పంపించాం. భూమి నుంచి 550 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న 1700 శాటిలైట్ల నుంచి ఈ చిన్న డిష్ సంకేతాలు పంపించడం, గ్రహించడం లాంటి పనులు చేస్తుంది. ఇవి ప్రతీ 90 నిమిషాలకు భూమి చుట్టూ తిరిగేందుకు వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి.’ అని చెప్పారు. ఇలాంటివి కొన్ని వేల శాటిలైట్లను ప్రవేశపెట్టాలని ప్లాన్ వేస్తున్నారు.
అయితే ఇలాంటి డిష్ ఇంటర్నెట్ ద్వారా సమస్యలు లేకపోలేదు. ఇంటి మీద అమర్చిన డిష్ పై పావురాలు కూర్చుంటే ఇంటర్నెట్ ప్రసారంలో అంతరాయం ఏర్పడుతుంది. పావురాలు వీటిని నీటి తొట్టొలు అనుకొని ఎక్కువగా వాలుతుంటాయి. కేవలం పావురాలు మాత్రమే కాకుండా మరో రకంగా కూడా అంతరాయం ఏర్పడుతుంది. స్టార్ లింక్ కంపెనీ ఇంటర్నెట్ తమ వినియోగదారులకు ఈ వారంలో భారీస్థాయిలో అంతరాయం ఏర్పడిందట. కనెక్షన్ పూర్తిగా మాయమై పోయిందని టెక్నాలజీ నిపుణుడు వుడ్ వర్డ్ చెప్పాడు. బీటా స్థాయిలోనే ఉన్న ఈ సేవలు ఇలా అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే ఈ సమస్యలకు కారణాలను మాత్రం స్టార్ లింక్ కంపెనీ వెల్లడించలేదు. మరోవైపు చిప్స్, లిక్విడ్ అక్సిజన్ ఇంధనాల కొరతతో శాటిలైట్లను ప్రవేశపెట్టడం వల్ల వాటిలో సమ్యలు ఏర్పడి ఇంటర్నెట్ ప్రసారంలో అంతరాయం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.
శాటిలైట్ ఇంటర్నెట్ కోసం మరి కొన్న కంపెనీలు క్యూలో ఉన్నాయి. అమెజాన్ ప్రాజెక్టు క్యూపర్ ద్వారా 3236 శాటిలైట్లను లాంచ్ చేయాలని చూస్తోంది. కెనడాకు చెందిన టెలీశాట్ అంతరిక్ష కక్ష్యలోకి 298 శాటిలైట్లను ప్రవేశపెడతానని అంటోంది. వన్ వెబ్ సంస్థకు ఇప్పటికే అంతరిక్షంలో హార్డ్ వేర్ ఉంది. ఈ వారంలో ఈ సంస్థ 34 శాటిలైట్లను ప్రారంభించింది. దీంతో ఇక మారుమూల ప్రాంతాల్లోనూ బ్రాడ్ బ్యాండ్ పొందే అవకాశం ఉంది.