Panchayat Funds: ఆంధ్రప్రదేశ్ లో సర్పంచుల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వం నుంచి ఎలాం టి సహాయం అందించకపోగా కేంద్రం ఇచ్చే నిధుల్ని కూడా లాగేసుకోవడం దారుణమని వారే విమర్శలు చేస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వం పైసా కూడా కేటాయించడం లేదు. అభివృద్ధి పనులు మాత్రం కనిపించడం లేదు. దీంతో సర్పంచుల్లో ఆందోళన నెలకొంది. రూ. లక్షలు ఖర్చు చేసి గెలిచినా ఇంతవరకు పైసా కూడా చేతికి రావడం లేదు. చేసిన అప్పులు తీర్చలేక సతమతమవుతున్నారు.

ఇప్పటికే 14వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచుల ఖాతాల్లో జమ కాగా వాటిని ప్రభుత్వం చెప్పకుండానే తీసుకుంది. దీంతో సర్పంచులకు నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం మళ్లీ 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా అలాగే తీసుకునేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్పంచుల్లో ఆగ్రహం పెరుగుతోంది కొందరైతే రాజీనామాలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
దీనిపై వైసీపీ సర్కారుపై పోరాటానికే సర్పంచులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఇస్తున్న నిదులను రాష్ర్ట ప్రభుత్వం తీసుకుని మాకు మొండిచేయి చూపించడంపై సర్పంచుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. మా డబ్బులు తీసుకునే అధికారం రాష్ర్ట ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుందని చెబుతున్నారు.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అన్ని అనుమానాలే?
సర్పంచుల నిధులు లాక్కోవడంపై మండిపడుతున్నారు. రాష్ర్ట ప్రభుత్వ తీరుపై హైకోర్టులో కేసు వేయాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రాష్ర్ట ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నిధుల్ని దారి మళ్లించే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు.