https://oktelugu.com/

పవన్-సంపూ ఇద్దరూ ఒకేటనన్న ఏపీ మంత్రి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు

‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ సాక్షిగా అంటుకున్న మాటల వేడి ఇంకా రగులుకుంటూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల విషయంలో సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పవన్ విమర్శలు సంచలనమయ్యాయి. ఈ క్రమంలోనే ఏపీ మంత్రులు తాజాగా ఈ వివాదంపై కౌంటర్ ఇస్తున్నారు. ఆన్ లైన్ టికెట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ తాజాగా మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2021 / 04:52 PM IST
    Follow us on

    ‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ సాక్షిగా అంటుకున్న మాటల వేడి ఇంకా రగులుకుంటూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల విషయంలో సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పవన్ విమర్శలు సంచలనమయ్యాయి. ఈ క్రమంలోనే ఏపీ మంత్రులు తాజాగా ఈ వివాదంపై కౌంటర్ ఇస్తున్నారు.

    ఆన్ లైన్ టికెట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ తాజాగా మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయనకెందుకు పట్టింపు అని ప్రశ్నించారు. పరిశ్రమలో ఎందరో ప్రముఖులు ఉండగా పవన్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారన్నారు. పవన్ కల్యాణ్ నటించినా సంపూర్ణేష్ బాబు నటించినా ఇద్దరి కష్టం ఒకేటేనన్నారు. ప్రజలకు జవాబుదారీ తనం ఉండేలా చేయడమే ప్రభుత్వ ఉధ్దేశమని చెప్పారు. పారదర్శకత కోసమే ఆన్ లైన్ పోర్టల్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. సినిమా ఖర్చులో నలుగురైదుగురు మాత్రమే లబ్ధిపొందడం సమంజసం కాదనే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు వివరించారు.

    పవన్ కళ్యాణ్ తో తనను పోల్చి విమర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై తాజాగా హీరో సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. ‘‘మంత్రి అనిల్ గారు.. మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం.. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో ఉన్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు’’ అంటూ మంత్రి అనిల్ కు సంపూర్ణేష్ బాబు కౌంటర్ ఇచ్చాడు.

    సంపూర్ణేష్ బాబు తనకు మద్దతుగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినా సరే.. ‘మంచి మనసున్న పవన్ కళ్యాణ్’ అంటూ తన సినీ రంగానికి చెందిన హీరోకే మద్దతుగా మాట్లాడడం విశేషం. మొత్తం సంపూ ఏపీ మంత్రికే కౌంటర్ వేయడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్లనుందో చూడాలి మరీ..