సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో సైతం యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ మీడియతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది సినీనటుల దగ్గర పెద్దమొత్తంలో డబ్బు ఉంటుందని భావిస్తారని అయితే అది వాస్తవం కాదని అన్నారు.
Also Read: ‘ఆరెంజ్’ దెబ్బకు అన్నయ్య నాగబాబు ఆస్తులు అమ్ముకున్నాడు.. పవన్ భావోద్వేగం
రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో వందల కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తారని.. ఇలాంటి సమయంలో ప్రజలకు సహాయం చేస్తే వాళ్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసే స్థాయిలో తమ దగ్గర డబ్బులు ఉండవని.. అందువల్లే పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేమని అన్నారు. సంపద అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర రాజకీయ నేతల దగ్గర, పారిశ్రామిక వేత్తల దగ్గర ఉందని పవన్ చెప్పారు.
కేసీఆర్ ప్రొ యాక్టివ్ అని.. అన్ని వర్గాల నుంచి తెలంగాణ సర్కార్ కు విరాళాలు అందుతున్నాయని.. సీఎం కేసీఆర్ ప్రో యాక్టివ్ కాబట్టి విరాళం ఇచ్చారని అన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అన్ని వర్గాలకు రీచ్ కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఏ విపత్తు జరిగినా చిత్ర పరిశ్రమ స్పందింస్తుందని అంత మాత్రాన చిత్ర పరిశ్రమ దగ్గర భారీగా సంపద ఉంటుందనుకుంటే మాత్రం పొరపాటేనని చెప్పారు.
Also Read: అమరావతి అక్రమాలపై విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కష్టపడి సంపాదించిన డబ్బు విరాళంగా ఇవ్వాలంటే ఎవరికీ మనసొప్పదని.. తాను కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చానని అలా ఇవ్వాలంటే పెద్ద మనస్సు ఉంటే మాత్రమే సాధ్యమవుతుందని వెల్లడించారు.