నిజానికి చంద్రబాబు హయాంలో 1998లో విద్యుత్ రంగంలో సంస్కరణల అమలు చేశారు. అప్పటి ఒప్పందాలను బట్టి తర్వాత ఆరుసార్లు వేతన సవరణ జరిగింది. దీని ప్రకారం తగ్గించిన ఫిట్ మెంట్ తో పాటు ఏడాదికి మూడు వంతున ఒక్కో ఉద్యోగికి 18 ప్రత్యేక ఇంక్రిమెంట్లు వచ్చాయి. దశాబ్దాల కింద కుదిరిన వేతన ఒప్పందంపై యాజమాన్యం అప్పటి సీఎం సంతకాలు చేశారు.
చివరగా 2018 మే 31న జరిగిన వేతన ఒప్పందం 2022 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందం కారణంగా సుదీర్ఘ సర్వీస్ ఉన్న స్వీపర్ కు కూడా రూ. లక్ష వరకు జీతం అందుకుంటున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ జీతాలను తగ్గించడానికి నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యోగుల జీతాల్లో మాస్టర్ స్కేల్ కు మించిన మొత్తాన్ని పర్సనల్ పేలో ఉంచాలని ఇటీవల బోర్డు సమావేశంలో నిర్ణయించి ప్రభుత్వానికి పంపారు.
బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. విద్యుత్ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి పదవీవిరమణ ప్రయోజనాల్లో కనీసం రూ.30-40 లక్షలు నష్టపోయే అవకాశం ఉంది. వచ్చే పింఛన్ భారీగా తగ్గుతుంది. నిజానికి ప్రభుత్వం తమ జీతాలను తగ్గిస్తుందన్న భయంతో చాలా మంది ఉద్యోగులు గత రెండేళ్లలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నాడు. రెండు మూడేళ్లలో పదవీవిరమణ చేసే సిబ్బంది ప్రయోజనాలు తగ్గుతాయన్న భయంతో ఇదే ఆలోచ చేస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం ప్రభుత్వంలో కాక రేపుతోంది. విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికైనా వినతిపత్రాలకే పరిమితమయ్యారు.