Sajjala Ramakrishna Reddy: అమలాపురం విధ్వంసం రాజకీయంగా మారిపోయింది. అధికార విపక్షాల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధానంగా దాడులు వెనుక వైసీపీ నేతల కుట్రపై ఆరోపణలు వస్తుండడంతో అధికార పార్టీ డిఫెన్ష్ లో పడింది. పార్టీకి కష్టం వచ్చిన ప్రతీసారి తెరపైకి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి విలేఖర్ల సమావేశం పెట్టి మరీ స్పందించారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే నవ్వొస్తుందని అని కూడా వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతల ఇళ్లపై ప్రభుత్వం ఎందుకు దాడులు చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. మా మంత్రులు, ఎమ్మెల్యేలపై మేం ఎందుకు దాడులు చేస్తాం… అలా దాడులు చేయించుకుని ఏం సాధిస్తామని ఆయన ప్రశ్నించారు. విపక్ష నేతల ఆరోపణలపై ప్రజలు చీదరించుకుంటారని అని కూడా అన్నారు. ఇవి దుర్మార్గపు రాజకీయాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుందన్నారు. అటాక్ ప్లాన్ చేసింది చేయించింది.. దాన్ని మాపై వేయాలని చూస్తుంది విపక్షాలు అని ఆయన ఆరోపించారు. విపక్ష నేతలందరూ కూడబలుక్కుని ఒకే విధమైన ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివారని సజ్జల విమర్శించారు.

అధికార పార్టీ నాయకులు తమకేం సంబంధం లేదని చెబుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అధికార పార్టీ పాత్ర చర్చనీయాంశమైంది. అల్లర్లకు కారణంగా భావిస్తున్న అన్యం సాయి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సీసీ టీవీ కెమెరాలో అతని వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతను విశ్వరూప్‌కు అనుచరుడని కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: Minister Puvvada Ajay Kumar: జగన్ ను దారుణంగా అవమానించిన తెలంగాణ మంత్రి
లేదు లేదు జనసేనలోనూ కీలకంగా పని చేశాడని మరికొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు కానీ.. ఆయనపై గతంలో రౌడీ షీట్ఉందని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తేశారని స్థానికులు చెబుతున్నారు. మరో వైపు తన ఇంటిపై దాడి చేసిన వారిలో అన్ని పార్టీల నేతలూ.. చివరికి తమ పార్టీ వారు కూడా ఉన్నారని.. మంత్రి విశ్వరూప్ చెబుతున్నారు. తమ పార్టీ కౌన్సిలర్ ఉన్నాడని… టీడీపీ, జనసేన, బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలున్నారనిచెబుతున్నారు. ఎవర్నీ వదిలి పెట్టబోమని అంటున్నారు. మొత్తంగా ఈ దాడి వ్యవహారం రాజకీయం అయిపోయింది. ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీసులు మాత్రం ఇంకా సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించే ప్రయత్నాల్లోనే ఉన్నారు.

అయితే వరుస ఘటనలతో వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. హత్యకేసులో ఎమ్మెల్సీ పాత్ర తేలడం, మరోవైపు అమలాపురం విధ్వంసం ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తొంది. విపక్షంలో ఉన్నప్పుడు విధ్వంస ఘటనలు వైసీపీకి కలిసి వచ్చాయి. కానీ ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ఇటువంటి ఘటన జరిగినప్పుడు విపక్షాలు అలెర్ట్ అవుతున్నాయి. అధికార పార్టీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ విపక్షాలపై ఆరోపణలు వచ్చినా.. అధికారంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఎటు వచ్చినా అధికార పార్టీకి చిక్కులు తప్పేలా లేవు.
Also Read:Tollywood Heroes Politics: రాజకీయ నాయకులుగా స్టార్ హీరోలు…?
[…] […]