Vladimir Putin: ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది కానీ ప్రేమను పంచదు. అది వ్యక్తి అయినా దేశమైనా ఒక్కటే. ప్రస్తుతం రష్యా కొనసాగిస్తున్న యుద్ధం ప్రపంచ మానవాళినే ప్రశ్నార్థకంగా మార్చుతోంది. నష్టాల బాటలో పయనిస్తున్న దేశాల ఆర్థిక స్థితి మరింత దిగజారుతోంది. ఫలితంగా రష్యా చర్యలకు అందరు బాధ్యులవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి మరెవరో బలవడం అంటే ఇదేనేమో. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై విమర్శలు వస్తున్నాయి. అయినా ఆయన మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. దీంతో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. తన పంతం కోసం ఒక దేశాన్ని దురాక్రమణ చేయడాన్ని అమెరికా సహా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. కానీ పుతిన్ లో మాత్రం చలనం రావడం లేదు.

పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలకు స్వదేశంలోనే ఆగ్రహ జ్వాలలు పెరుగుతున్నాయి. స్వలాభం కోసం దేశాన్ని సర్వనాశనం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే పుతిన్ ను గద్దె దింపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పుతిన్ ఆగడాలకు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. పుతిన్ యుద్ధ కాంక్షను మానుకుని వారికి ఆపన్నహస్తం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక దేశం ఉసురు మనకు మంచిది కాదనే వాదనలు కూడా వస్తున్నాయి. అయినా పుతిన్ మాత్రం పట్టించుకోవడం లేదు.
Also Read: KCR Delhi Tour Ends: దేశ పర్యటనకు ఆర్థిక ఆటంకాలు.. అర్ధంతరంగా ముగిసిన కేసీఆర్ టూర్!
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతంలో ప్రజలు వేలాది సంఖ్యలో బయటకు వచ్చారు. యుద్ధం వద్దంటూ లేఖలు రాస్తున్నారు. యుద్ధంపై విరక్తితో ఉక్రెయిన్ పై దాడులు ఆపాలని కోరుతున్నారు. పుతిన్ సరైన నిర్ణయం తీసుకోకుంటే ఆయనను పదవి నుంచి దింపేందుకు వెనుకాడమని చెబుతున్నారు. పిచ్చిపట్టిన వాడిగా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ ను ఇబ్బందులకు గురిచేస్తూ ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. పుతిన్ నిర్వాకం వల్ల తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రజాగ్రహంపై పుతిన్ మాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో ఉక్రెయిన్ ను స్వేచ్ఛగా బతకనివ్వాలని సూచిస్తున్నారు.

అమెరికా వ్యాపార దిగ్గజం మెక్ డొనాల్డ్స్ రష్యాతో అన్ని వ్యాపారాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. రష్యా చేస్తున్న చర్యలకు విసిగి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేసింది. దీంతో అన్ని దారులు మూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ సమాజంలో పుతిన్ ఏకాకిగా మిగులుతున్నారు. అయినా ఆయనలో యుద్ధ కాంక్ష మాత్రం చల్లారడం లేదు. పసికూన ఉక్రెయిన్ ను సర్వనాశనం చేయాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ పుతిన్ ఇకనైనా యుద్ధం ఆపితేనే బాగుంటుందనే వాదనలు అందరిలో వస్తున్నాయి. పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటుండటంతో చివరకు ఏం జరుగుతుందో తెలియడం లేదు.
మొత్తానికి ప్రస్తుతం రష్యా ప్రజలు పుతిన్ తీరుతో విసిగిపోయారు. అవసరమైతే ఆయనను గద్దె దింపేందుకు కూడా వెనకాడటం లేదని తెలుస్తోంది. కానీ అది సాధ్యమేనా? రష్యా రాజ్యాంగంలో ఆ అవకాశం ఉందా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా పుతిన్ కు పదవీ గండం మాత్రం పొంచి ఉందని చెబుతున్నారు. ఇకపై పుతిన్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. యుద్ధం ముగిస్తారా? లేక కొనసాగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
Also Read:YS Jagan- KTR: దావోస్ వేదికగా కేటీఆర్ జగన్ షేక్‌హ్యాండ్!! పుకార్లు షికార్లు!?
[…] […]
[…] […]