Vladimir Putin : అతడు సినిమా చూశారా.. అందులో ఒక సన్నివేశంలో బ్రహ్మానందం నాజర్ కాళ్ళు మొక్కడానికి ప్రయత్నిస్తాడు. దానికి నాజర్ వారిస్తాడు. నాజర్ అలా చేయడాన్ని చూసి…”ముసలోడే కానీ మహానుభావుడు” అని ఓ డైలాగ్ అంటాడు. ప్రస్తుతం ఈ డైలాగును మనం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 71 సంవత్సరాలు వయసులో రసిక్ రాజా లాగా ఆయన చేస్తున్న చిలిపి పనులను చూస్తే అలా కాక మరి ఎలా అంటాం. ప్రపంచ దేశాలు వద్దంటున్నా ఉక్రెయిన్ దేశంపై యుద్ధం చేస్తున్నాడు. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. దీనిపై దేశం యావత్తు మొత్తం గగ్గోలు పెట్టినా పుతిన్ పట్టించుకోడు. పట్టించుకునే క్యారెక్టర్ కూడా అతడిది కాదు. కేవలం యుద్ధం మాత్రమే కాదు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపించడంలో పుతిన్ తర్వాతే ఎవరైనా.. అమెరికా అధ్యక్షులుగా ఉన్నప్పుడు బిల్ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ చిలిపి పనులు చేశారు అంటారు గాని.. వారందరూ పుతిన్ తర్వాతే. ఎందుకంటే వారంతా పబ్లిసిటీ కోరుకుంటారు. పుతిన్ దానికి దూరంగా ఉంటాడు. అంతే తేడా.
ప్రస్తుతం పుట్టిన వయసు 71 సంవత్సరాలు.. అతడు తనకంటే 32 సంవత్సరాలు చిన్నదైన మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం జరుగుతున్నది. 39 సంవత్సరాల ఎకతెరినా మిజులినా మహిళతో ఆయన కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎకతెరినా మిజులినా ఎవరో కాదు.. పుతిన్ కు సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ సెనేటర్ ఎలెనా మిజులినా కుమార్తె..ప్రస్తుతం ఎలెనా మిజులినా కుమార్తె క్రెమ్లిన్ కు మద్దతుగా ఉండే సేఫ్ ఇంటర్నెట్ లీగ్ కు హెడ్ గా కొనసాగుతున్నారు.. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో..రష్యా తో పాటు పుతిన్ పై వచ్చే విమర్శలను సమూలంగా నిర్మూలించడమే ఈ సంస్థ ముఖ్య విధి.
ఎకతెరినా మిజులినా కుందనపు బొమ్మలా ఉంటుంది.. సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.. సేఫ్ ఇంటర్నెట్ లీగ్ హెడ్ అయిన తర్వాత పుతిన్ తో ఎకతెరినా మిజులినా సంబంధం బలపడిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారని రష్యా అధికార వర్గాలు చెబుతున్నాయి. 71 సంవత్సరాల పుతిన్ కు గతంలోనే పెళ్లయింది. 30 సంవత్సరాల పాటు ఒక మహిళతో ఆయన వైవాహిక జీవితంలో ఉన్నారు. 2014లో తన భార్య లియుడ్మిలా కు ఆయన విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత జిమ్నాస్ట్, ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అలీనా కబయేవ తో సమ్ థింగ్ సమ్ థింగ్ నడిపారని ప్రచారం జరిగింది. అంతేకాదు ఆమె తో పుతిన్ కు ముగ్గురు సంతానం కూడా ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత పుతిన్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడని.. అందువల్లే తరచూ అమ్మాయిలను మార్చేవాడని.. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు అందులో భాగమేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.