Rajamouli: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. వీళ్ళ కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో భారీ ప్రభంజనాన్ని సృష్టించారు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఛత్రపతి సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయాడట.
ముఖ్యంగా క్లైమాక్స్ లో మదర్ సెంటిమెంట్ తో నడిచే సీన్ల ల్లో డైలాగులు లేకుండా ప్రభాస్ పలికించిన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే రాజమౌళికి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయంట. అంతటి గొప్ప ఎమోషన్ ని పండించడం చూస్తున్న రాజమౌళి కట్ చెప్పలేకపోయాడట, నిజంగా ఈ ఒక్క సీన్ ప్రభాస్ యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏంటో తెలియజేస్తుంది. ఇక అదే సెంటిమెంట్ సీన్ ని బాహుబలి లో కూడా ప్రభాస్ అద్భుతంగా పండించారంటూ మరోసారి రాజమౌళి ప్రభాస్ గురించి చెప్పడం చూస్తుంటే నిజంగా ఆయన ఎంత గొప్ప నటుడో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇక గత సంవత్సరంలో కూడా ఆది పురుషు, సలార్ రెండు సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల్ని పలకరించాడు.
అందులో ఆదిపురుషు ప్లాప్ అవ్వగా, సలార్ మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక ఈ సంవత్సరం రాజసాబ్, కల్కి రెండు సినిమాలు కూడా భారీ సక్సెస్ లను అందుకుంటాయంటూ ప్రభాస్ ఈ రెండు సినిమాల మీద మంచి కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒకటి కమర్షియల్ ఎంటర్ టైనర్ కాగా, మరొకటి సైన్స్ ఫిక్షన్ సినిమా కావడం విశేషం…