Russia Ukraine Crisis 2022: ప్రస్తుతం రష్యా, యుక్రెయిన్ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరి చూపు నాటో దళాల మీదనే ఉంది. ఏ క్షణంలో అయినా యుక్రెయిన్‌కు అండగా.. ఈ బలగాలు రంగంలోకి దిగుతాయోమో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా తమ అమ్ముల పొదిలో ఉన్న బలమైన అస్త్రాన్ని తీసింది.

పుతిన్ సేనకు షాక్ ఇస్తూ.. జర్మనీలోకి ఈఏ-18జీ గ్రౌలర్ యుద్ధ విమానాన్ని బయటకు తీసింది. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక ఎలక్ట్రానిక్ పోరాట జెట్. శత్రు రాడార్లను అతి దూరం నుంచే పసిగట్టి.. సర్వ నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. శత్రువుల క్షిపణి స్థావరాలను క్షణాల్లో నిర్వీర్యం చేయడంలో దీనికి సాటి లేదు.
Also Read: Rahul Gandhi Tweet On Paddy Procurement: రాహుల్ దయతో ఎట్టకేలకు టీఆర్ఎస్ తో ఫైట్ కు కాంగ్రెస్ రెడీ..
ఇది ఏఎల్ క్యూ-99 హై ప్యాడ్ లతో పాటు, లో బ్యాండ్ టాక్టికల్ ప్యాడ్ లను కలిగి ఉంటుంది. ఇవి విమానానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ పవర్‌ను అందిస్తాయి. దీన్ని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసింది. గతంలో అనేక పోరాటాల్లో పాల్గొని సమర్థవంతంగా శత్రువులను ఓడించిన హర్నెట్ యుద్ధ విమానంలో కొన్ని మార్పులు చేసి దీన్ని తయారు చేసింది బోయింగ్ కంపెనీ.
ఈ విమానం ఉండే ఎలక్ట్రానిక్ పవర్.. శత్రువుల కమ్యూనికేషన్ సంకేతాలను గుర్తించి ఈజీగా సర్వనాశనం చేయగలదు. ఈ యుద్ధ విమనాలను గతంలో సిరియా, ఆఫ్టనిస్థాన్, ఇరాక్ లో జరిగిన యుద్ధంలో అమెరికా ఉపయోగించింది. మరి ఇప్పుడు సడెన్ ఈ యుద్ధ విమానాన్ని నాటో దళంలోకి ఎందుకు దింపిందనేదే పెద్ద చర్చనీయాంశంగా మారింది.

రష్యాపై మొదటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా.. పుతిన్ సేనకు కళ్లెం వేయడానికే పక్కలో బల్లెంను దింపిందని అంటున్నారు. అయితే తాము ఈ విమానాన్ని రష్యాపై ప్రయోగించబోమని అమెరికా చెబుతోంది. కానీ అమెరికా మాటలు అస్సలు నమ్మలేం. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని.. ఏ రూపంలో అయినా అటాక్ చేయగలదు. ఓ వైపు యుక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు ఫలిస్తున్న సమయంలో.. అమెరికా రెచ్చగొట్టడానికే రష్యాలో పక్కలో బల్లెంను దింపిందనే చర్చ మొదలైంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి