https://oktelugu.com/

మే 17తర్వాత రోడ్లపైకి బస్సులు..?

కేంద్రం విధించిన లాక్డౌన్ 3.0 ఈనెల 17తో ముగియనుంది. ఇప్పటికే కేంద్రం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను గుర్తించి లాక్డౌన్ 2.0లో కొన్ని సడలింపులను ఇచ్చింది. గ్రీన్ జోన్లో అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా ఆరెంజ్ జోన్లలో కొన్ని షరతులతో కూడిన అనుమతులను కేంద్రం ఇచ్చింది. రెడ్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వలేదు. ఈ సడలింపులపై తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టింది. లాక్డౌన్ కారణంగా పెద్దఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కొల్పోవడంతో ఆదాయ […]

Written By: , Updated On : May 11, 2020 / 11:36 AM IST
Follow us on

కేంద్రం విధించిన లాక్డౌన్ 3.0 ఈనెల 17తో ముగియనుంది. ఇప్పటికే కేంద్రం రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను గుర్తించి లాక్డౌన్ 2.0లో కొన్ని సడలింపులను ఇచ్చింది. గ్రీన్ జోన్లో అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా ఆరెంజ్ జోన్లలో కొన్ని షరతులతో కూడిన అనుమతులను కేంద్రం ఇచ్చింది. రెడ్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వలేదు. ఈ సడలింపులపై తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టింది. లాక్డౌన్ కారణంగా పెద్దఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కొల్పోవడంతో ఆదాయ మార్గాలపైనే దృష్టిసారించాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులను బార్ల తెరిచాయి. మద్యం షాపుల ఓపెన్ తో భౌతికదూరం మాటను గాలికొదిలేసినట్టయింది? ప్రభుత్వాలు ఆదాయం సమకూర్చుకోవడానికి కరోనాతో సావాసం చేసేందుకు రెడీ అవుతోన్నాయి.


కండక్టర్ల వ్యవస్థకు మంగళం..!

లాక్డౌన్ 2.0లో కేంద్రం కొన్ని సడలింపులిచ్చినా ప్రజారవాణాలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక మూడోదశ లాక్డౌన్ ఈనెల 17తో ముగియనుండటంతో ఈసారి ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోన్నాయి. సడలింపుల అమలు మాత్రం రాష్ట్రాల నెత్తినే పెట్టనుంది. ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీ బస్సులు, ట్రైన్లు, విమాన సర్వీసులకు కొన్ని షరతులతో కూడిన అనుమతి లభించే అవకాశం ఉంది. ఒకసారి ప్రజారవాణకు అనుమతిస్తే మాత్రం ఇప్పటివరకు ఇళ్లకే పరిమితమైన జనాలను కంట్రోల్ చేయడం కష్టంగా మారడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి షరతులతో ప్రజా రవాణాకు అనుమతి ఇస్తుందో అనే ఆసక్తి మొదలైంది.

సీఎంలతో మోడీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్!

ఇదిలా ఉంటే ఆర్టీసీలో యాజమాన్యాలు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా సాకుతో కండక్టర్ల వ్యవస్థకు మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది. బస్సులో కండక్టర్లు ప్రయాణికుల మధ్య తిరుగుతూ టిక్కెట్లు ఇస్తే కరోనా వ్యాప్తించే అవకాశం ఉంటుందని సాకును అధికారులు చూపిస్తున్నారు. ప్రయాణికులు ఆన్‌లైన్, కరెంట్‌ రిజర్వేషన్‌, బస్టాండ్, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొనుగోలు బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఏసీ బస్సుల్లో పూర్తిగా నగదు రహితంగా లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జగన్ ప్రభుత్వ అండతోనే ఎల్‌జీ పాలిమర్స్ నిర్లక్ష్యం!

ప్రయాణికులు భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు ఎక్కడానికి ముందే ప్రయాణికులకు శానిటైజర్లను అందిస్తారు. ఆర్టీసీ కరోనా రాకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు కండక్టర్లకు మాత్రం ఎలా కరోనా వ్యాపిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది? దీనిపై ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే..!