Bigg Boss 7 Telugu: సీరియల్ బ్యాచ్ లో గొడవలు… ప్రియాంక నన్ను వెధవను చేసిందన్న అమర్

గోట్ అయితే ఏముంది రెండు ఒకటే కదా అని తింగరి సమాధానం చెప్పాడు అమర్. షీప్ వేరు .. గోట్ వేరు అని శివాజీ .. అర్జున్ లు చెప్పారు. రెండూ మేకలే కాదన్నా అంటూ అడిగాడు. ఆ తర్వాత ప్రశాంత్, యావర్ లను డిస్క్వాలిఫై చేసాడు బిగ్ బాస్.

Written By: NARESH, Updated On : November 30, 2023 12:24 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టూ ఫినాలే రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఫినాలే అస్త్ర గెలిచేందుకు కంటెస్టెంట్స్ తెగ కష్టపడుతున్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మూడు టాస్క్ లు బిగ్ బాస్ నిర్వహించారు. ఇక ‘ ఎత్తర జెండా ‘ టాస్క్ లో ప్రశాంత్ విజయం సాధించాడు. అనంతరం ఫినాలే రేస్ లో భాగంగా మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇది ప్రతి సీజన్ లో కామన్ గా జరిగిన టాస్క్ . గత సీజన్లలో కూడా ఈ టాస్క్ సమయంలో కంటెస్టెంట్స్ బాగా ఫన్ జెనరేట్ చేశారు.

అదే విధంగా ఈ రోజు ‘ గెస్ చెయ్ గురూ ‘ టాస్క్ ఫన్నీ గా సాగింది. బిగ్ బాస్ సమయానుసారంగా వివిధ శబ్దాలను వినిపిస్తూ ఉంటారు. ఆ శబ్దం దేనికి సంబంధించిందో అని కనిపెట్టి వరుసగా తమ బోర్డు మీద రాయాలి. ఇందులో రేస్ లో కొనసాగుతున్న ప్రియాంక, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, అర్జున్, గౌతమ్ లు పోటీ పడ్డాడు. వరుసగా శబ్దాలు వినిపిస్తూ .. మేక అరుపులు వినిపించారు బిగ్ బాస్. అయితే అమర్ మేక కు బదులుగా గొర్రె అని రాశాడు.

షీప్ అయితే ఏముంది .. గోట్ అయితే ఏముంది రెండు ఒకటే కదా అని తింగరి సమాధానం చెప్పాడు అమర్. షీప్ వేరు .. గోట్ వేరు అని శివాజీ .. అర్జున్ లు చెప్పారు. రెండూ మేకలే కాదన్నా అంటూ అడిగాడు. ఆ తర్వాత ప్రశాంత్, యావర్ లను డిస్క్వాలిఫై చేసాడు బిగ్ బాస్. ఇక తర్వాత కప్ప సౌండ్ ఎలా ఉంటుంది అమర్ అంటూ బిగ్ బాస్ అడిగారు. బెక బెక .. కాకపోతే మగ కప్పు సౌండ్ వేరు .. ఆడ కప్పు సౌండ్ వేరే ఉంటుంది అని అమర్ దీప్ చెప్పాడు.

తర్వాత ప్రశాంత్ ని హెలికాప్టర్ సౌండ్ ఎలా ఉంటుంది అంటూ కాసేపు ఆటపట్టించారు బిగ్ బాస్. స్కోర్ బోర్డు లో ప్రియాంక లీస్ట్ లో ఉండటంతో .. ఫినాలే రేస్ నుంచి తప్పించారు. ప్రియాంక దగ్గరున్న 250 పాయింట్లలో సగం తనకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పారు. ఇక క్షణం కూడా ఆలోచించకుండా గౌతమ్ పేరు చెప్పింది ప్రియాంక. దీనితో అమర్ ‘ నాకు ఇవ్వాలని అనిపించలేదా అని ప్రియాంకని అడిగాడు. చివరికి ‘వెధవని అయ్యింది నేనే కదా’ అంటూ అడిగి వెళ్ళిపోయాడు.