https://oktelugu.com/

టీఆర్ఎస్ ఎంపీ ఖాతాలో రూ.400 కోట్ల బ్లాక్ మనీ..!

టీఆర్‌‌ఎస్‌ నేతలు అవినీతిలో కూరుకుపోయారని ఇప్పటికే భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఒక్కొక్కటిగా ఆధారాలు సైతం వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో చేసిన సోదాల్లో రూ.400 కోట్ల నల్లధనం గుర్తించినట్లుగా ఐటీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో సంస్థ పేరు ఏమీ చెప్పలేదు. విషయం తెలిసినా తెలంగాణ మీడియాలో మాత్రం ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేశారు. ఆ కంపెనీల్లో చేసిన సోదాల్లో బోగస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 2, 2021 / 01:35 PM IST
    Follow us on


    టీఆర్‌‌ఎస్‌ నేతలు అవినీతిలో కూరుకుపోయారని ఇప్పటికే భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఒక్కొక్కటిగా ఆధారాలు సైతం వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో చేసిన సోదాల్లో రూ.400 కోట్ల నల్లధనం గుర్తించినట్లుగా ఐటీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో సంస్థ పేరు ఏమీ చెప్పలేదు. విషయం తెలిసినా తెలంగాణ మీడియాలో మాత్రం ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేశారు. ఆ కంపెనీల్లో చేసిన సోదాల్లో బోగస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు.

    Also Read: వాహ్‌.. ఏం స్కెచ్‌ : ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం మర్డర్లు

    రూ.1.66 కోట్ల నగదు, కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు ఇటీవల సోదాలు చేసిన కంపెనీ ఎంఎస్ఎన్ ఫార్మా. ఆ కంపెనీ మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి చెందినది. నేరుగా ఫార్మాస్యూటికల్స్ తయారు చేయడం కన్నా.. ఫార్మా కంపెనీలకు ఇంటర్మీడియట్స్ సప్లై చేయడంలో ఈ కంపెనీ పేరు మోసింది. ఈ కంపెనీకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో ఈ అవకతవకలు గుర్తించారు.

    బడా కంపెనీలపై అప్పుడప్పుడు ఐటీ దాడులు జరుగుతుంటాయి. అది కామన్‌. కాకపోతే.. ఎక్కువగా ఇన్ ఫ్రా రంగంలో ఉన్న కంపెనీలపై గురిపెడుతుంటారు ఐటీ శాఖ వారు. ఈ సారి ఫార్మా కంపెనీపై దృష్టి పెట్టారు. అది ఓ సంచలనం అయితే.. అది టీఆర్ఎస్ ఎంపీకి చెందినది కావడం మరో సంచలనం. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ పెద్దలకు చెందిన అత్యంత సన్నిహితులైన వారి కంపెనీలపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నారు. వందల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలను గుర్తించినట్లుగా చెబుతూనే ఉన్నారు. ఇవన్నీ.. అవసరమైనప్పుడు బయటకు తీసి ఉపయోగించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో టీఆర్‌‌ఎస్‌ను బీజేపీ టార్గెట్‌ చేసింది.

    Also Read: ఎమ్మెల్సీ రంగంలోకి కేసీఆర్‌‌ : వినూత్న ప్రచారం

    బెంగాల్‌లోనూ ఇలా టీఎంసీ నేతల్ని టార్గెట్ చేసి కొన్ని కేసులు నమోదు చేశారు. శారదా చిట్స్ సహా పలు కేసుల్ని నమోదు చేశారు. అన్నీ కేంద్ర సంస్థల కేసులే. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కర్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి.. వారంతా బీజేపీలో చేరిపోయారు. ఉన్న కొద్ది మందిపై ఎన్నికల సమయంలో సీబీఐ, ఐటీ, ఈడీలు నోటీసులు జారీచేస్తున్నాయి. వారు కూడా టీఎంసీ తరపున యాక్టివ్‌గా లేకుండా చూసుకుంటున్నారు. ఇక.. మరో రాష్ట్రమైన తెలంగాణలోనూ పాగా వేసేందుకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే బీజేపీ ఇలాంటి వ్యూహాన్ని దీర్ఘకాలికంగా అమలు చేస్తోందన్న అనుమానం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్