వైసీపీ ఎంపీ కంపెనీ రూ.300 కోట్లు ఎగ్గొట్టిందా?

వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. నష్టాలు రాకుండా రూ.1200 కోట్లు నష్టాలు వచ్చినట్లు డాక్యుమెంట్లు సృష్టించినట్లు గుర్తించారు. లెక్కల్లో లేని రూ.300 కోట్ల నగదు గుర్తించారు. సింగపూర్ లోని ఓ సంస్థకు రాంకీకి చెందిన ఆస్తులను అమ్మినట్లుగా చూపించారు. ఎగ్గొట్టిన పన్నును చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించిందని ఐటీ శాఖ పేర్కొంది. కానీ ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో […]

Written By: Srinivas, Updated On : July 9, 2021 6:57 pm
Follow us on

వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. నష్టాలు రాకుండా రూ.1200 కోట్లు నష్టాలు వచ్చినట్లు డాక్యుమెంట్లు సృష్టించినట్లు గుర్తించారు. లెక్కల్లో లేని రూ.300 కోట్ల నగదు గుర్తించారు. సింగపూర్ లోని ఓ సంస్థకు రాంకీకి చెందిన ఆస్తులను అమ్మినట్లుగా చూపించారు. ఎగ్గొట్టిన పన్నును చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించిందని ఐటీ శాఖ పేర్కొంది.

కానీ ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఎక్కడ కూడా రాంకీ సంస్థ పేరు వెల్లడించలేదు. మామూలుగా సోదాలు చేసినప్పుడల్లా వివరాలు వెల్లడించే ఐటీ శాఖ సంస్థల పేర్లు బయటపెట్టదు. సంస్థ చేసిన సోదాలను బట్టి తెలిసిపోతుంది. ఈనెల 6న హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థలో సోదాలు చేసినట్లు చెప్పడంతో అది రాంకీదేనని తెలిసిపోయింది.

పన్ను ఎగ్గొట్టేందుకు కృత్రిమ నష్టాలు చూపెట్టడం, ఆస్తులను సింగపూర్ కంపెనీకి అమ్మినట్లుగా లెక్కలు రాయడంతో సీరియస్ కేసు అయ్యే ప్రమాదం ఉంది. ఎగవేసిన పన్నులు కడతామని కంపెనీ చెప్పిందని ఐటీ శాఖ చెబుతోంది.. అయినప్పటికి ఇంకా దర్యాప్తు జరుగుతోంది. ఇంకా లోతుగా విచారణ జరిపితే మరిన్న కోణాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేసు ఇంతటితో ఆగదని తెలుస్తోంది. దీని వెనుక చాలా కోణాలు దాగి ఉన్నాయని అనుమానిస్తున్నారు. విదేశాలకు తరలించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు. వాటిని ఇండియాకు రప్పించేందుకు ఐటీ శాఖ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. మరో వైపు సెబీ కూడా రాంకీ సంస్థ షేర్లపై ఆరా తీస్తోంది. ఈ గుట్టంతా బయటపడితే చాలా పెద్ద సంచలనమే వెలుగులోకి వస్తుందని అనుమానిస్తున్నారు.