Financial survey: పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వే 2021-22 సమర్పించారు. ఈ ఆర్థిక సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సర్వే ప్రకారం అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరినవారిలో 78 శాతం మంది నెలకు రూ.1,000 పెన్షన్ కోరుకుంటున్నారు.

ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులకు నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. అయితే, ఎంత పెన్షన్ కావాలన్నది ముందుగానే సబ్స్క్రైబర్లు వెల్లడించాలి. దాన్ని బట్టే ప్రతీ నెల పెన్షన్ ను జమ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎంత పెన్షన్ కావాలని ఖాతాదారులను సర్వే చేశారు. అలా సర్వేలో ఎంత పెన్షన్ కోరుకుంటున్నారనేది స్పష్టమైంది.
Also Read: సైడ్ ఇన్ కమ్ కోసం రాశి ఖన్నా కూడా మొదలెట్టింది !
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో నెలకు రూ.1,000 పెన్షన్ కోరుకుంటున్న వారు 78 శాతం కాగా, నెలకు రూ.5,000 కోరుకుంటున్నవారు 14 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఇక మిగతా 8 శాతం మంది నెలకు రూ.2,000, రూ.3,000, రూ.4,000 చొప్పున పెన్షన్ కోరుకుంటున్నారు. 2021 సెప్టెంబర్ నాటికి చేరిన సబ్స్క్రైబర్ల వివరాల ప్రకారం లెక్క ఇది. కాగా, అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరుతున్నవారిలో యువత సంఖ్య పెరుగుతోందని సర్వేలో తేలింది.

కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజన పథకం స్టార్ట్ చేసిన సంగతి అందరికీ విదితమే. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ స్కీమ్‌లో 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు చేరొచ్చు. వారికి 60 ఏళ్ల వయస్సు వచ్చిన నాటి నుంచి ప్రతీ నెల రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. ఇకపోతే ఈ స్కీమ్‌లో చేరేప్పుడే తమకు ఎంత పెన్షన్ కావాలో తెలిపి, నెలకు రూ.42 నుంచి రూ.1,454 మధ్య డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
కరోనా మహమ్మారి వచ్చిన నాటి తర్వాత కాలంలో అనగా 2019 డిసెంబర్ తర్వాత పెన్షన్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు, పొదుపు స్కీమ్స్ లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. 2021 సెప్టెంబర్ నాటికి అటల్ పెన్షన్ స్కీమ్..కు 463 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చారు. అటల్ పెన్షన్ స్కీమ్ సబ్ స్క్రైబర్ల సంఖ్య సమీప భవిష్యత్తులో ఇంకా పెరిగే చాన్సెస్ ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.
Also Read: పేరుకు పెద్దమనిషి.. అతని నీచబుద్ధి వల్ల బాలిక ఆత్మహత్య..