నిజం దాచిన బండి సంజయ్.. సంచలన వ్యాఖ్యలు

  అసలు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇన్ని రోజులు ఢిల్లీలో ఎందుకున్నారన్నది మిస్టరీ. ఈ విషయాన్ని ఆయనా తెలుపలేదు. అయితే బండి సంజయ్ కరోనా వల్లే ఇన్నాళ్లు ఢిల్లీలో ఉన్నాడని తెలిసింది. కరోనాతో 20 రోజుల పాటు క్వారంటైన్స్లో ఉండి కరోనా నుండి కోలుకొని తాజాగా నేరుగా ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చారు. Also Read: రాజకీయాలపై ‘రౌడీ దేవరకొండ’ సంచలన కామెంట్స్..! కరోనాను జయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ […]

Written By: NARESH, Updated On : October 11, 2020 10:33 am
Follow us on

 

అసలు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇన్ని రోజులు ఢిల్లీలో ఎందుకున్నారన్నది మిస్టరీ. ఈ విషయాన్ని ఆయనా తెలుపలేదు. అయితే బండి సంజయ్ కరోనా వల్లే ఇన్నాళ్లు ఢిల్లీలో ఉన్నాడని తెలిసింది. కరోనాతో 20 రోజుల పాటు క్వారంటైన్స్లో ఉండి కరోనా నుండి కోలుకొని తాజాగా నేరుగా ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చారు.

Also Read: రాజకీయాలపై ‘రౌడీ దేవరకొండ’ సంచలన కామెంట్స్..!

కరోనాను జయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్ కు చేరుకొని అక్కడి నుండి బయలుదేరి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి, నల్లగొండ నరసింహ స్వామిని, వేములవాడ రాజన్నలను దర్శించుకున్నారు. ముగ్గురు దేవుళ్ల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఉదయం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సంజయ్ కి పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికి భారీ కాన్వాయ్ తో మూడు పుణ్యక్షేత్రాల మీదుగా కరీంనగర్ తీసుకొచ్చారు. దారి పొడువునా కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కొండగట్టులో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ముస్లింల బుజ్జగింపు కోసమేనని హాట్ కామెంట్స్ చేశారు. భాగ్యనగరంలో పేద బీసీలకు అన్యాయం చేసి క్రికెట్ టీంలను కన్నవారికి బీసీ రిజర్వేషన్లు అందించడానికే ఈ ప్రత్యేక సమావేశాలు అంటూ ఆడిపోసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణ కోసం త్రిబుల్ తలక్ పై చట్టం చేస్తే మాట్లాడని సీఎం కేసీఆర్..ఇప్పుడు మాత్రం వల్ల ఓట్ల కోసం , వాళ్ళను ఎక్కువ మందిని బీసీ కేటగిరీలో జీహెచ్ఎంసీలో పోటీ చేయించడానికి ప్రత్యేక చట్టం చేయాలనే ఈ అత్యవసర అసెంబ్లీ సమావేశాలు జరపడం సిగ్గుచేటు అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు..?

రాష్ట్రంలో విలాయతాండవం చేస్తున్న సమస్యలు సీఎం కేసీఆర్ కు పట్టవు కానీ.. ఓట్లు సీట్లు మాత్రం కావాలని మండిపడ్డారు.. ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అమలు చేయడు… ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడు కానీ బిసిల రిజర్వేషన్లను కాలరాస్తూ అందులో ముస్లింలకు అవకాశం కల్పించడానికి ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

క్రికెట్ టీంలు కన్నవారికి సీఎం కేసీఆర్ అందలం ఎక్కించాలని చుస్తున్నారని విమర్శించారు.కరీంనగర్ లో హిందువులు బొందుగాళ్ళు అంటే హిందువులు అంత ఒకటై ఎలా బుద్ది చెప్పారో.. హైదరాబాద్ లో కూడా అలాగే హిందువులు అంత ఏకమై కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

గతంలో ఉన్న బీసీలకు చెందాల్సిన 22 కార్పొరేషన్ సీట్లను మైనారిటీలకు ఇచ్చాడని…ఇప్పుడు వాటిని రెండింతలు చేయడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాడని బండి ఆరోపించారు.. కేసీఆర్ కుటిల రాజకీయ బుద్దిని, ఓటు బ్యాంకు రాజకీయాన్ని ప్రజల ముందు ఎండగడతామని బండి సంజయ్ అన్నారు.