Role Of Opposition Party In India: క్షేత్రస్థాయిలో ఎన్ని వ్యతిరేక సంఘటనలు జరిగినా..? బీజేపీని రైతులు, ఇతర వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నా కానీ.. ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుంది. యూపీలో రైతులను బీజేపీ కేంద్రమంత్రి కొడుకు తొక్కి చంపినా కూడా అక్కడ ఆ పార్టీనే గెలిపించేశారు. ప్రజలు కేవలం సమర్థ నాయకత్వం, అభివృద్ధి, సంక్షేమం, పాలన మాత్రమే చూస్తున్నారని ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలతో క్లియర్ కట్ గా అర్థమైంది. ప్రస్తుత పరిస్థితులకు దేశంలో బలంగా ప్రతిపక్షం లేకపోవడం కూడా కారణం.. బీజేపీకి పోటీగా కనుచూపు మేరలో కాంగ్రెస్ బలంగా లేకపోవడం కూడా బీజేపీకి ఎదురులేకుండా చేస్తోంది. ఇన్ని గెలుపుల తర్వాత ఇక బీజేపీని ప్రశ్నించే నాథుడు దేశంలో ఉంటాడా? అన్నది ప్రశ్న.
ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలిగింట కమలం వికసించింది. గత ఏడేళ్లుగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇదే జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకుంటూ మిగతా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రంలో సాధ్యం కాలేదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా మారుతామని ఈ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ గెలిచిన నుంచి చెప్పుకొస్తున్నారు. రెండేళ్ల కిందట ఇక్కడ విజయం సాధించిన ఆమె గోవా లో తమ అభ్యర్థులను బరిలోకి దింపారు. యూపీలో ఎస్పీ తరుపున ప్రచారం చేశారు. కానీ అవేవీ బీజేపీ ముందు పనిచేయలేదు. దీంతో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: మోడీ రిటైర్ మెంట్.. యోగికి అపాయింట్ మెంట్?
2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు.. పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో ఇప్పిటికే అధికారం ఉన్న రాష్ట్రాలను కోల్పోతుంది. 2019 వరకు ఆ పరిస్థితి మారకపోవడంతో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ పార్టీ నాయకుడు తనదే లోపం అంటూ అధ్యక్ష పదవి నుంచి తొలగిని మెయిన్ కార్యక్రమాలన్నీ ఆయన చేతులమీదుగానే సాగుతున్నాయి. దీంతో పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న గోవా రెండోసారి చేజారిపోయింది.
కొన్ని రోజుల నుంచి దేశంలో తెలంగాణ పాలన తెస్తామని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలస్తూ వస్తున్నారు కేసీఆర్. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ తాజాగా వెలువడిన ఫలితాలతో ఆ పరిస్థితి కూడా లేనట్లే తెలుస్తోంది. కేసీఆర్ లా ముందుకొచ్చిన నేత మమతా బెనర్జీ మాత్రమే. మిగతా సీఎంలో కాంగ్రెస్ అండతో సీఎం సీట్లో కూర్చొన్నారు. ఇంకొందరు రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడికే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి ప్రత్యామ్నం ఎవరు..? అనే చర్చ సాగుతోంది.
ఏ పార్టీ అయినా ప్రతిపక్షం లేకపోతే తనకెదురులేదన్నట్లుగా ఉంటుంది. దీంతో ప్రశ్నించేవారు లేక కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల తరుపున అడిగే వారు కావాల్సిన అవసరం ఉంది. యూపీఏ హయాంలో 500 లోపే ఉన్న గ్యాస్ ఇప్పుడు వెయ్యి రూపాయలయింది. 60 రూపాయల పెట్రోల్ నేడు 100 దాటింది. దీంతో పెట్రో ధరలు పెరిగాయిన అడపాదడపా ఆందోళనలు చేయడమే తప్ప ఈ ధరలపై ప్రశ్నించడానికి సరైన ప్రతిపక్షం లేదనే చెప్పారు. దేశం అభివృద్ధి చెందిందని బీజేపీ ప్రభుత్వం చెప్పకపోయినా.. ఎప్పటికప్పడు ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఎన్నో విశ్లేషణలు జరిగాయి. రైతు చట్టాలతో మోదీపై వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. యోగీ అభివృద్ధి చేసిందేమీ లేదని ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని కామెంట్స్ చేశారు. లాక్డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కూలీల కన్నీళ్ల కథలు చూశాక ఇక యోగి ఇంటికే అనుకున్నారు. పిల్లలకు ఉద్యోగాలు రాలేదు.. ఉన్నవాళ్లకు పనులు లేవని మేధావులు అంచనా వేశారు. కానీ ఈ విషయాల్లో బీజేపీని కొట్టేవాళ్లు లేరని తేలిపోయింది. ఇవేవి యోగి సర్కార్ పై ప్రభావం చూపలేదు.
అయితే ప్రభుత్వం మీద అంతో ఇంతో వ్యతిరేకత ఉండొచ్చు. కానీ దానిని ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకోలేకపోయాయి. బీజేపీ లోపాలను ఎత్తి చూపడంలో విఫలమయ్యాయి. బీజేపీ పాలన బాగాలేదు.. అని కొందరు అన్నారు. అయితే మరి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎవరు ఉంటారు..? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. తాము ఈ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా కాపాడుతామంటూ హామీ ఇవ్వలేకపోయారు. దీంతో బీజేపీ విజయం సాధించింది.
Also Read: ఇదో చరిత్ర: యూపీలో రెండోసారి బీజేపీ గెలవడానికి కారణాలివీ!