కరోనా రోగుల సేవలకు రోబోలు..!

కరోనా వైరస్ బారినపడిన వారికి సేవలందిస్తున్న వైద్యులు, పారమెడికల్ సిబ్బంది వైరస్ బరినపడుతుండటంతో నెల్లూరు అధికారులు ప్రత్యామ్నాయంగా రోబోను రంగంలోకి దించారు. ఈ రోబోలు ఒకేసారి 40 కేజీల ఆహారం, మందులను సరఫరా చేయగల రోబో కరోనా వైరస్ కేసులు ఏపీలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాతలు జిల్లా అధికారులకు రోబోను అందించారు. రోగులకు ఆహారం, మందులు అందించేందుకు రోబోలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రోబోలను అధికారులు రంగంలోకి దించారు. ఇప్పటికే ఓ […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 8:08 pm
Follow us on


కరోనా వైరస్ బారినపడిన వారికి సేవలందిస్తున్న వైద్యులు, పారమెడికల్ సిబ్బంది వైరస్ బరినపడుతుండటంతో నెల్లూరు అధికారులు ప్రత్యామ్నాయంగా రోబోను రంగంలోకి దించారు. ఈ రోబోలు ఒకేసారి 40 కేజీల ఆహారం, మందులను సరఫరా చేయగల రోబో కరోనా వైరస్ కేసులు ఏపీలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాతలు జిల్లా అధికారులకు రోబోను అందించారు. రోగులకు ఆహారం, మందులు అందించేందుకు రోబోలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రోబోలను అధికారులు రంగంలోకి దించారు.

ఇప్పటికే ఓ రోబో సేవలను ప్రారంభిచింది. తాజాగా దీనికి మరో రెండు రోబో జతచేరనున్నాయి. మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,332కి పెరిగింది. మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 7,727 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ 88,061 మందికి అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు.