https://oktelugu.com/

పెరుగుతున్న కేసులు?: థర్డ్ వేవ్ హెచ్చరికలు?

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పదా? అన్నా భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విశ్వనగరం హైదరాబాద్ లో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫంక్షన్లు, అంత్యక్రియలు, సామూహిక సమావేశాల్లో పాల్గొన్న వారికి ఈ వైరస్ సోకుతోంది. సెకండ్ వేవ్ తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో ఇప్పుడు థర్డ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రజల నిర్లక్ష్యమే థర్డ్ వేవ్ కు కారణం అయ్యింటుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 29, 2021 / 09:38 AM IST
    Follow us on

    తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పదా? అన్నా భయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విశ్వనగరం హైదరాబాద్ లో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫంక్షన్లు, అంత్యక్రియలు, సామూహిక సమావేశాల్లో పాల్గొన్న వారికి ఈ వైరస్ సోకుతోంది.

    సెకండ్ వేవ్ తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో ఇప్పుడు థర్డ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రజల నిర్లక్ష్యమే థర్డ్ వేవ్ కు కారణం అయ్యింటుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా మాస్కులు ధరించకపోవడం.. భౌతిక దూరం పాటించకపోవడం.. శుభకార్యాలు, ఉత్సవాలు, అంత్యక్రియల్లో పాల్గొనడం లాంటి వాటి వల్ల కరోనా కోరలు చాస్తోంది.

    తెలంగాణలోని గ్రామాల్లో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోంది. గ్రామాలకు గ్రామాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇటీవల కాలంలో మరణాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోనూ సెకండ్ వేవ్ తగ్గిందనుకుంటున్న సమయంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

    మొన్నటివరకు అస్సలు గ్రామాల్లో పెద్దగా కరోనా లేకుండేది. కానీ ఇప్పుడు కేసులు, మరణాలు పెరిగి ఏ ఊరుకు ఆ ఊరు లాక్ డౌన్ పెట్టేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీల్లో 15 రోజుల క్రితం వరకు ఒకటీ రెండు తప్ప పెద్దగా కేసులు ఉండేవి కావు.. 10 రోజులుగా వాటి సంఖ్య బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

    గాంధీ, టిమ్స్ సహా హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా రోగుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

    హైదరాబాద్ నగరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామాల్లో కేసులు పెరగడంతో థర్డ్ వేవ్ ముప్పు తప్పదా? అన్న భయాలు వెంటాడుతున్నాయి. కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేయడమే దీనికి కారణం అని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.