RGV Political Entry: కంట్రవర్సల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్… దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వైవిధ్యభరితమైన చిత్రాలతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ఆయన అదే స్థాయిలో వివాదాస్పదుడు అన్న ముద్ర కూడా తనపై వేసుకున్నారు. సోషల్ మీడియా యాక్టివ్ కాక ముందే ఆర్జీవీ ప్రకటనలు మీడియాలో ప్రకంపనలు సృష్టించేవి. అటు సోషల్ మీడియా ఎంటరైన తరువాత ఆర్జీవీ కామెంట్స్ పతాక లెవల్ కు వెళ్లిపోయాయి. అవతలి వ్యక్తి ఎంతటి వారైనా కామెంట్స్ చేయడానికి వెనుకాడరు. తన మనసులో అవతలి వ్యక్తిపై ఉండే అభిప్రాయాన్ని తనదైన శైలిలో బయటపెట్టడం ఆర్జీవీ సొంతం. గతంలో చిరంజీవి కుటుంబంపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. అదే కుటుంబంపై అభిమానం చూపిన పరిణామాలున్నాయి. తాజాగా చిరంజీవి విషయంలో అవధాని గరికిపాటి నరసింహరావు వ్యవహరించిన తీరుపై ఆర్జీవీ వరుస షటైరికల్ కామెంట్స్ తో హీటెక్కించారు. చిరంజీవిని ఏనుగుతో పోల్చారు. అయితే ఆర్జీవీలో షడన్ చేంజ్ పై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.

సినిమారంగంలో ఉండడం బోరు కొట్టిందో ఏమో.. ఇప్పుడు ఆయన రాజకీయాల వైపు చూస్తున్నట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై ఆర్జీవీ కానీ.. అటు జనసేన వర్గాలు కానీ స్పందించడం లేదు. ఎంతోకొంత నిజం లేకపోతే ఈ ప్రచారం బయటకు రాదని.. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చిన్న విషయాలకు రియాక్టయ్యే.. ఆర్జీవి పొలిటికల్ ఎంట్రీపై రకరకాల రూమర్స్ వస్తున్న పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఈ వార్త ఎలా బయటకు వచ్చిందో? నిజమో? కాదో అన్న విషయాన్నైనా బయటపెట్టాలి కదా? దీనిపై మరింత వివాదం ముదిరితే కానీ ఆర్జీవీ బయటకు వచ్చేలా కనిపించడం లేదు.

అయితే గరికిపాటి ఎపిసోడ్ తో మెగా ఫ్యామిలీ అభిమానులకు తనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవడంలో ఆర్జీవీ సక్సెస్ అయ్యారు. స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఆర్జీవీ మెగా ఫోన్ ఎప్పుడు పట్టిన సందర్భాలున్నాయి. ఈ మధ్యన బయోపిక్ పై దృష్టిసారించిన ఆయన చాలా మంది ప్రముఖుల జీవితచరిత్రలపై సినిమాలు తీశారు. అయితే ఆయన స్థాయికి తగిన సినిమాలు మాత్రం తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు జనసేన సరైన వేదికగా భావిస్తున్నట్టు సమాచారం. అందుకే గతం నుంచి మెగా కాంపౌండ్ వాల్ తో ఉన్న గ్యాప్ ను సరిచేసుకునే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. దీనికి గరికిపాడి ఎపిసోడ్ ను వినియోగించుకున్నారు. త్వరలో తన మనసులో ఉన్న మాటను ఆర్జీవి బయపెట్టే అవకాశం ఉంది. పొలిటికల్ ఎంట్రీపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.