రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్: చిచ్చుపెట్టిన వీహెచ్

ఒకరు నిచ్చెనపైకి ఎక్కుతుంటే వారిని ఎక్కనీయకుండా వెనక్కి లాగేసే పద్ధతి ఒకటుంది. ఇండియన్స్ ను అందుకు ఉదాహరణగా చూపుతారు. 100 ఏళ్ల కాంగ్రెస్ పాలనను దీనికి అప్లై చేస్తారు. కాంగ్రెస్ కు ఈ సామెత అతికినట్టు సరిపోతుందంటారు. అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా మారింది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దాదాపు రేవంత్ రెడ్డికి ఖాయమైందని.. త్వరలోనే ఏఐసీసీ ప్రకటిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పీసీసీ చీఫ్ నియామకం […]

Written By: NARESH, Updated On : June 9, 2021 8:07 pm
Follow us on

ఒకరు నిచ్చెనపైకి ఎక్కుతుంటే వారిని ఎక్కనీయకుండా వెనక్కి లాగేసే పద్ధతి ఒకటుంది. ఇండియన్స్ ను అందుకు ఉదాహరణగా చూపుతారు. 100 ఏళ్ల కాంగ్రెస్ పాలనను దీనికి అప్లై చేస్తారు. కాంగ్రెస్ కు ఈ సామెత అతికినట్టు సరిపోతుందంటారు. అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా మారింది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దాదాపు రేవంత్ రెడ్డికి ఖాయమైందని.. త్వరలోనే ఏఐసీసీ ప్రకటిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పీసీసీ చీఫ్ నియామకం ఇప్పుడు సీనియర్ నేతల మధ్య చిచ్చుపెట్టింది. రేవంత్ ను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరోసారి దీనిపై స్పందించారు. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ప్రకటనకు ముందే సీనియర్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ రాశారు. ప్రతి ఎన్నికల్లో ఓటమికి కారణాలేమిటోనని మేథో మథనం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

కేరళలో పార్టీ ఓటమి పాలు కాగానే పీసీసీని మార్చేశవారని.. ఇక్కడ అలాంటిదేమీ చేయలేదని ఆరోపించారు. 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. తననే బూతులు తిడుతున్న పార్టీలో ఎలా సాగుతుందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవ్వబోతున్న వేళ ఇప్పుడు సడెన్ గా ఆయనపై వ్యతిరేకగళం వినిపిస్తున్న వైనం మళ్లీ పీసీసీ చీఫ్ ఎంపిక మొదటికొచ్చేలా ఉంది. ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి మరోసారి పీసీసీ చీప్ అయ్యే యోగ్యాన్ని కోల్పోబోతున్నారన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.