హుజూరాబాద్ ఉప ఎన్నికపై రేవంత్ ఫుల్ ఫోకస్

తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే రెండు నెలల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయం బాగా వేడెక్కుతోంది. హుజూరాబాద్ బైపోల్ లో ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున బలంగా కనిపిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంపై తన వ్యక్తిగత పట్టును నిరూపించుకోవాలనుకుంటున్నాడు. పాలక టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను ఓడించడానికి, రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి అన్ని ప్రయత్నాలను, బలాలను వాడుతోంది. గత […]

Written By: NARESH, Updated On : July 15, 2021 8:57 pm
Follow us on

తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే రెండు నెలల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయం బాగా వేడెక్కుతోంది.

హుజూరాబాద్ బైపోల్ లో ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున బలంగా కనిపిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంపై తన వ్యక్తిగత పట్టును నిరూపించుకోవాలనుకుంటున్నాడు. పాలక టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను ఓడించడానికి, రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి అన్ని ప్రయత్నాలను, బలాలను వాడుతోంది.

గత ఎన్నికల్లో హుజూరాబాద్ లో ప్రధాన పోరాటం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే సాగింది. అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో ఈటలకు గట్టిపోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచాడు.

ఇక ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2వేల ఓట్లు కూడా గెలవలేకపోయింది. డిపాజిట్ కోల్పోయింది. కౌశిక్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం.. ఆడియో లీకులతో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం కష్టంగా మారింది.

దీంతో హుజూరాబాద్ లో ఇప్పుడు ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి, అధికార టీఆర్ఎస్ మధ్యనే పోరాటం నెలకొంది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి నిలబడితే మరింతగా పోటీ ఉంటుంది.

ఇక కాంగ్రెస్ కు హుజూరాబాద్ లో సొంత ఓటు బ్యాంకు ఉంది. హుజూరాబాద్ లో బలమైన క్యాడర్ బేస్ కూడా ఉంది. కౌశిక్ రెడ్డితోపాటు వారంతా వెళ్లారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కఠినమైన పోరాటం చేయబోతోంది. అందుకే కొత్తగా నియమించబడిన పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికను తీవ్రంగా పరిగణించారు. గట్టిగా పోరాడాలని డిసైడ్ అయ్యారు.