CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ సినిమా టికెట్ల గురించి ప్రస్తుతం జరుగుతున్న విధంగా చర్చలు జరగలేదు. ఎందుకో జగన్ అనవసరంగా ఈ విషయాన్ని లాగి లాగి ఆగమాగం చేస్తున్నాడు. ఈ వ్యవహారం పై వివాదం అసలు అనవసరం. పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇలాంటి విషయాల్లో పగ బట్టి సినిమా వాళ్ళను బాధ పెట్టడం అనేది ముఖ్యమంత్రికి ఉన్న స్థాయిని తగ్గించడమే.
తప్పు ఎవరది ? ఎందుకు ఇలా జగన్ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది ? అని ఎవరూ క్లారిటీ ఇవ్వలేరు. కానీ, సినిమా పరిశ్రమ ఎక్కువగా ఓ సామాజిక వర్గానికి సంబంధించినది కాబట్టి.. ఆ సామాజిక వర్గం పై తనకు కోపం ఉంది కాబట్టి.. జగన్ ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజం అయితే.. ఇక జీవితంలో జగన్ పార్టీ మళ్ళీ గెలవకూడదు అని ప్రతి కళాకారుడు మనస్ఫూర్తిగా కోరుకోవాలి.
లేకపోతే, కళకు కులానికి మధ్య సంబంధం ఏమిటి ? కులం కోసం కళను ఇబ్బంది పెడతారా ? కళాకారుల జీవితాలు ఎన్నో ఇబ్బందుల మధ్య సాగుతాయి. వాళ్లకు అన్నీ ఉన్నాయనే భ్రమ కలుగుతుంది. కానీ, వాళ్లకు కనీస స్వేచ్ఛ కూడా ఉండదు. ఏది ఏమైనా ఈ సినిమా టికెట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సినిమా పరిశ్రమకు తీవ్ర ద్రోహం చేయడం మంచి పద్ధతి కాదు.
Also Read: పీఆర్సీపై జగన్ కీలక భేటీ.. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేనా?
రాజకీయాల్లో నేడు వచ్చిన గెలుపు రేపు ఉండకపోవచ్చు. పైగా అధికారం అంటేనే మార్పుకి పర్యాయపదం. నేడు అధికారం ఒకరి దగ్గర ఉంటే రేపు మరొకరి దగ్గర ఉంటుంది. కాబట్టి.. అధికారం శాశ్వతం అనుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అసలుకే మోసం వస్తోంది. నష్టపోయిన గుండె తట్టుకుంటుంది. కానీ, అవమానించ పడ్డ గుండె నిద్ర పోదు.
ప్రతీకారం కోసం యుద్ధం చేయమని చెబుతుంది. మరో రెండేళ్ల తర్వాత అయినా రానున్న ఎన్నికల్లో సినిమా వాళ్ళంతా ఏకం అయి జగన్ కి వ్యతిరేకంగా పని చేస్తే.. జగన్ పార్టీకి కచ్చితంగా నష్టం ఉంటుంది. అయినా తన సొంత వ్యాపారం అయితే జగన్ ఇలా ఇష్టం వచ్చినట్లు ధరలు తగ్గించగలడా ? ఏ.. ‘సాక్షి పత్రిక 1 రూపాయకి ఇవ్వొచ్చు కదా ? కళాకారుల ప్రతీకారం జగన్ అధికారానికి మంచిది కాదు. కాబట్టి జగన్ ఆలోచించు.
Also Read: సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా?