https://oktelugu.com/

Chiranjeevi Dupe: మెగాస్టార్‌కు డూప్ గా నటించేది ఎవరో తెలుసా? 30 ఏండ్లుగా ఒక్క‌డే…

Chiranjeevi Dupe: టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి పేరును స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్న చిరంజీవి. కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చాలా మూవీస్ లో రియల్ స్టంట్స్ చేసే చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఫ్యాన్స్ నచ్చే కథలను చేస్తూ వారి గుండెల్లో ఆయన చెదిరిపోని ముద్ర వేసుకున్నారు. కొన్ని సమయాల్లో కొన్ని రిస్కింగ్ టైంలో తమకు బదులుగా […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 28, 2021 / 01:40 PM IST
    Follow us on

    Chiranjeevi Dupe: టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి పేరును స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్న చిరంజీవి. కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చాలా మూవీస్ లో రియల్ స్టంట్స్ చేసే చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఫ్యాన్స్ నచ్చే కథలను చేస్తూ వారి గుండెల్లో ఆయన చెదిరిపోని ముద్ర వేసుకున్నారు.

    Chiranjeevi

    కొన్ని సమయాల్లో కొన్ని రిస్కింగ్ టైంలో తమకు బదులుగా చాలా మంది హీరోలు డూప్‌లను వాడుతూ ఉంటారు. వాటిని రియల్‌గా చేసేందుకు హీరోలో వెనకడుగు వేస్తారు. అలాంటి టైంలోనే డూప్ లను వాడతారు. గతంలో డూప్ ల గురించి బయటకు పెద్దగా వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం డూప్ ల గురించి బయటకు బాగా తెలుస్తోంది. కొంత మంది టీవీ ఛానెళ్స్ వాళ్లు వారిని బయటకు తీసుకొస్తుండటంతో వారికి బాగా ఆదరణ లభిస్తోంది.

    Also Read: ప్చ్.. చిరు ఈ ఆశ భావం ఇంకా ఎన్నాళ్ళు ఇలా ?

    ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన సైతం చాలా మూవీస్ లో డూప్ లతో అనేక సన్నీవేశాలు చేయించారు. ఆయనకు ఒక వ్యక్తి సుమారు 30 ఏళ్ల నుంచి డూప్ గా చేస్తున్నారట. తాగాజా ఈటీవీలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే ఓ షోను స్టార్ట్ చేశారు. చాలా ప్రాంతాలకు వెళ్తున్న ఈ షో నిర్వాహకులు అక్కడున్న వారి టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. ఇందులో భాగంగా ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాకు వెళ్లారు నిర్వాహకులు. ఈ టైంలో ఈ షోకు చిరంజీవి డూప్ ప్రేమ్ కుమార్ వచ్చారు.

    ఆయనకు ప్రేమ్‌కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ అనే కంపెనీని సైతం కొనసాగిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస మూవీస్ చేస్తూ చాలా బిజీ అయిపోయరు. ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ తో కలిసి ఆచార్య అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే చాలా హైప్స్ క్రియేట్ అయ్యాయి. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

    Also Read: మహేష్-రాజమౌళి కాంబోపై ఎన్టీఆర్, చరణ్ సెటైర్లు..!

    Tags